Home Minister Anitha : ఒంగోలు పోలీసు వారిపై ప్రశంసలు కురిపించిన హోంమంత్రి
గూగుల్ మ్యాప్ ద్వారా దేవాలయాలను గుర్తించి మరి....
Minister Anitha : ఒంగోలు పోలీసులను హోంమంత్రి వంగలపూడి అనిత(Minister Anitha) ప్రశంసించారు. శభాష్… అంటూ ఒంగోలు పోలీసులను అభినందించారు. రాష్ట్రంలోని 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడి 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి వచ్చిన రూ.15.5లక్షల సొమ్ముతో జల్సాలు చేస్తున్న దొంగల ముఠాను పట్టుకోవడం అభినందనీయమన్నారు. దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టును ఒంగోలు పోలీసులు రట్టుచేశారు. ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ దొంగలను పట్టుకున్నారు. గూగుల్(Google) మ్యాప్ ద్వారా దేవాలయాలను గుర్తించి చోరీ చేసిన ముఠా సభ్యులు.. ఆ తరువాత దేవాలయాల్లోని సీసీ కెమెరాల డీవీఆర్‌ను పట్టుకెళ్లి దొరక్కుండా తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Home Minister Anitha Comments
కాగా…దేవాలయాల్లో దొంగతనం చేసిన సొత్తును కొనుగోలు చేసి తిరిగి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని గత ఆదివారం (డిసెంబర్ 15) ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.15.50 లక్షల విలులైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు సీతంపేటకు చెందిన కాకినాడ కృష్ణారావు అలియాస్ రామకృష్ణగా గుర్తించారు. అయితే.. ఈ ఏడాది జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో నాగులుప్పలపాడు మండలం చదలవాడలోని రఘునాయక స్వామి దేవాలయంలో.. బి.నిడమనూరు సాయిబాబా గుడిలోనూ ఒకే ముఠా చోరీ చేసి బంగారు, వెండి ఆభరణాలను అపహరించింది.
గూగుల్(Google) మ్యాప్ ద్వారా దేవాలయాలను గుర్తించి మరి.. చోరీకి పాల్పడిన ముఠా సభ్యులు… ఆ తరువాత దేవాలయాల్లోని సీసీ కెమెరాల డీవీఆర్‌ను పట్టుకెళ్లేవారు. ఆపై వీరు దొంగించిన దొంగిలించిన వస్తువులను శ్రీకాకుళంకు చెందిన కృష్ణారావు కొనుగోలు చేశాడు. ఈ దొంగల ముఠాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవర సిపన్య అలియాస్ రవి, సవర బోగేష్, తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన బత్తిన శ్రీకాంత్ ఉన్నారు. దేవాలయాల్లో దొంగతనాలపై విచారణ చేపట్టిన పోలీసులు.. గతనెల 24న ఈ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కోర్టుకు తరలించగా.. న్యాయాధికారి రిమాండ్ విధించారు. దొంగతనం చేసిన వస్తువులను కృష్ణారావుకు విక్రయించినట్లు ముఠా సభ్యులు పోలీసులకు తెలపడంతో అతడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ ముఠా వద్ద నుంచి కృష్ణారావు 100 దేవాలయాలకు సంబంధించిన 300 కిలోల వెండి కొనుగోలు చేశాడు.
ఈక్రమంలో దొంగ సొత్తును చెన్నైలో విక్రయించేందుకు ఆదివారం (డిసెంబర్ 15)న రాత్రి కృష్టారావు శ్రీకాకుళం నుంచి హౌరా రైలులో చెన్నై వెళుతుండగా ఒంగోలులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 15 కిలోల వెండి, 4 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.15.50 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్న ఒంగోలు రూరల్ సీఐ ఎన్.శ్రీకాంత్‌బాబు, నాగులుప్పలపాడు ఎస్సై బి.శ్రీకాంత్, సిబ్బందిని ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.
Also Read : Minister Kandula Durgesh : ఏపీ టూరిజం అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన