న్యూఢిల్లీ : సన్స్ మైక్రోసాఫ్ట్ అధినేత వినోద్ ఖోస్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావం అన్ని రంగాలలో ఉంటుందని, ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం మంచిదని సూచించారు. దేశ రాజధాని వేధికగా జరిగిన ఏఐ వరల్డ్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎక్కువగా ఐటీ, బిజినెస్ ప్రాసెస్ అసోసియేట్ (బీపీఓ) రంగాలపై ప్రభావం పడుతుందని అన్నారు. తాజాగా వినోద్ ఖోస్లా చేసిన కామెంట్స్ ఐటీ రంగంలో కలకలం రేపాయి. రాబోయే రోజులలో ఇండియాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆలోచించక పోవడం మంచిదని సూచించారు.
ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, ఉద్యోగం కోసం చదవడం అనేవి సరైన ఆలోచన కాకపోవచ్చంటూ బాంబు పేల్చారు వినోద్ ఖోస్లా. వీటి స్థానంలో రోబోలు చేరుకుంటాయని, వేలాది మంది చేసే పనులను కొన్ని రోబోలు భర్తీ చేస్తాయన్నారు. రాబోయే రోజులలో ఏఐలో నైపుణ్యం కలిగిన వారికే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆరోగ్య సంక్షరణ, విద్యా రంగానికి కొంత మేలు చేకూరుతుందని అన్నారు. సన్ మైక్రోసిస్టమ్స్ ను స్థాపించడం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ప్రపంచంలో అమెరికాకు ఎందుకంత క్రేజ్ ఉందనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వినోద్ ఖోస్లా. మనం కోరుకున్నది జరుగుతుందని అనుకోవడానికి వీలు లేదు. కానీ వెనక్కి తగ్గడం అంటూ జరగదన్నారు.
