శ్రీలంక : అసలైన పోరాటానికి వేదిక కానుంది శ్రీలంక దేశ రాజధాని కొలంబో నగరం. ఇప్పటికే కోట్లాది మంది దాయాదుల మధ్య జరిగే కీలకమైన మ్యాచ్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. తటస్థ వేదికగా దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై గెలుపొందింది. ఆ తర్వాత ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇందులో భాగంగా ఆదివారం ఇరు జట్లు మరోసారి తలపడనున్నాయి. ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 మెగా టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నాయి. టోర్నీ ప్రారంభం నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ససేమిరా అన్నాయి. ఇండియాలో ఇండియాతో ఆడే ప్రసక్తి లేదంటూ మారాం చేశాయి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు.
దీంతో ఐసీసీ అటు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) లు సంచలన ప్రకటన చేశాయి. అంతే కాకుండా ఐసీసీ టోర్నీలో తాము ఆడబోమంటూ ప్రకటించాయి. దీనిని సీరియస్ గా తీసుకుంది ఐసీసీ. ఈ మేరకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరో వైపు అంతర్జాతీయ స్థాయిలో ఆయా జట్లతో , క్రికెట్ బోర్డులతో ఒప్పందాలు చేసుకు్న కార్పొరేట్, దిగ్గజ కంపెనీలన్నీ తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చాయి. లేక పోతే తమకు ముందస్తు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రూ. 300 కోట్లకు పైగా చెల్లించాలంటూ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో ఆయా బోర్డులు దారికి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్ తో ఆడేందుకు దాయాది పాకిస్తాన్ ఒప్పుకుంది. ఇవాళ ఇరు జట్లలో ఎవరు గెలుస్తారనే దానిపై టెన్షన్ కొనసాగుతోంది.
