Anurag Thakur : ప్రపంచ స్టార్టప్ లలో 3వ స్థానంలో భారత్
కేంద్ర క్రీడా, సమాచార మంత్రి ఠాకూర్
Anurag Thakur : కేంద్ర క్రీడా, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ స్టార్టప్ లలో భారత దేశం మూడవ (3)వ స్థానంలో ఉందని వెల్లడించారు. వ్యాక్సిన్లు (టీకాలు) , మొబైల్ ఫోన్ల తయారీలో అతి పెద్ద ఎగుమతిదారుగా నిలిచిందని స్పష్టం చేశారు ఠాకూర్.
జమ్మూ యూనివర్శిటీలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (ఏఐయూ) ఆధ్వర్యంలో జరుగుతున్న 36వ ఇంటర్ యూనివర్శిటీ నార్త్ జోన్ యూత్ ఫెస్టివల్ వేడుకల్లో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొబైల్ ఫోన్లు, రక్షణ పరికరాలలో భారత దేశం అతి పెద్ద ఎగుమతి దారుగా మారిందన్నారు. దాదాపు 90,000 స్టార్టప్ లు (అంకురాలు) , 30 బిలియన్ డాలర్ల విలువైన 107 యునికార్న్ కంపెనీలతో స్టార్టప్ ఎకో సిస్టమ్ లో భారత్ టాప్ లో ఒకటిగా నిలిచిందని చెప్పారు అనురాగ్ ఠాకూర్.
ఈ ఘనత కేవలం భారత దేశంలోని యువత వల్లనే సాధ్యమైందని కొనియాడారు. యువత తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుందని అన్నారు కేంద్ర క్రీడా, సమాచార , ప్రసార శాఖ మంత్రి.
హరిత ఆర్థిక వ్యవస్థలో అభివృద్ది చెందాలంటే హరిత ఉద్యోగాలను ఉత్పత్తి చేసేందుకు స్థిరమైన పెట్టుబడులు అవసరమన్నారు. భారత దేశం ఆ లక్ష్యం వైపు పయనిస్తోందని చెప్పారు అనురాగ్ ఠాకూర్.
ఈ దేశంలోని యువతకు వేలాది గ్రీన్ జాబ్స్ కల్పించేందుకు గాను ఊ. 8 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. ఈ కోట్లను రాబోయే 5 ఏళ్లలో ఖర్చు చేస్తామన్నారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి. ప్రపంచంలో 1 0 శాతం , 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే గ్లోబల్ హబ్ గా భారత దేశం ముందుకు సాగుతుందన్నారు.
Also Read : మెగా స్పార్ట్స్ మీట్ పై ప్రధాని మోదీ