Kolusu Parthasarathi : ప్రజలే జెండా అభివృద్దే ఎజెండా
మాజీ మంత్రి కొలుసు పార్థసారథి
Kolusu Parthasarathi : కొలుసు పార్థసారథి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన అరుదైన నాయకుడు. రాజకీయాలకు అతీతంగా ప్రజలే జెండాగా పురోభివృద్దే అజెండా లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా నేత కొలుసు పార్థసారథి. ప్రస్తుతం ఆయన ఎక్కువగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. పిలిస్తే పలికే లీడర్ గా వినుతికెక్కిన పార్థసారథి విద్యాధికుడు కూడా. అన్ని వర్గాల ప్రజలతో ఆయనకు సత్ సంబంధాలు ఉన్నాయి. పెనమలూరు అంటేనే పార్థసారథి అన్నంతగా తనను తాను మార్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన పదవిని అలంకరించారు.
Kolusu Parthasarathi Journey
కొలుసు పార్థసారథి పూర్తి పేరు కొలుసు పార్థసారథి యాదవ్ . ఆయన 18, ఏప్రిల్ 1965లో కరకంపాడులో పుట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్థసారథికి(Kolusu Parthasarathi) అన్ని అంశాల పట్ల మంచి పట్టుంది. ప్రత్యేకించి ఆయన కుల, మతాలకు అతీతంగా, పార్టీలకు దూరంగా ప్రజలను ఆదరిస్తారు. వారి సమస్యలను సావధానంగా వింటారు. ఎవరినీ నొప్పించరు. ఎంతటి సమస్య అయినా సరే, వాళ్లకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. ప్రజా నాయకుడికి పదవి కంటే ప్రజలే ముఖ్యమని నమ్ముతారు. అదే తనను గెలిపిస్తుందని నమ్ముతారు.
అందుకే జనం ఆయనను తమ ఇంట్లో సభ్యుడిగా భావిస్తారు కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathi). ఆయన 2004లో, 2009లో, 2019లో మూడు సార్లు ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా 2004లో తొలిసారి వుయ్యూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పెనమలూరు నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు పార్థసారథి. రాజకీయంగా అపారమైన అనుభవం కలిగిన కొలుసు పార్థసారథి అంటే వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నమ్మకం, ప్రేమ కూడా.
గతంలో వైఎస్ హయాంలో పశు సంవర్దక, డెయిరీ డెవలప్ మెంట్ , ఫిషరీస్, వెటర్నీ యూనివర్శిటీలకు మంత్రిగా పని చేశారు. అంతే కాదు సెకండరీ ఎడ్యుకేషన్ శాఖకు కూడా మంత్రిగా పని చేశారు కొలుసు పార్థసారథి. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి విద్యా శాఖ మంత్రిగా చరిత్రలో నిలిచి పోయారు .
పార్థసారథిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి గతంలో ఎంపీగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కృష్ణా జిల్లాలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం డైనమిక్ లీడర్ వైఎస్ జగన్ సారథ్యంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులపై దృష్టి సారించారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని సీఎం ఇచ్చిన టార్గెట్ ను ఇచ్చే పనిలో పడ్డారు. రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను సావధానంగా వింటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం గడప గడపకు కార్యక్రమానికి ముందుండి నడుస్తున్నారు. ప్రజా యాత్ర ద్వారా ప్రజలను కలిసే పనిలో పడ్డారు. భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అంటున్నారు.
Also Read : Election Surveys Comment : సర్వేల గోల జనం విలవిల