krish 2.0 Drone : మందుల పిచికారీకి డ్రోన్ల తయారీ
యుఏవీ క్రిషి 2.0 ఆవిష్కరణ
krish 2.0 Drone : వ్యవసాయ రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం డ్రోన్లు హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో పేరు పొందిన డ్రోన్ తయారీ టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్(Drogo Drones) ప్రైవేట్ లిమిటెడ్ కొత్తగా మరో డ్రోన్ ను ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఎవరి సహాయం లేకుండానే పొలాల్లో పిచికారి చేసేందుకు మానవ రహిత వైమానిక విమానం (యుఏవీ) క్రిష్ 2.0 ని ఆవిష్కరించింది.
ఈ డ్రోన్ రోజుకు 20 ఎకరాల్లో క్రిమి సంహారక, పురుగు మందులను పిచికారీ చేస్తుంది. నెలలో 750 నుండి 900 ఎకరాల్లో రైతులు తమ పంటలను కాపాడుకునేలా అవసరమైన మందులను పిచికారీ చేసే ఛాన్స్ ఉందని కంపెనీ పేర్కొంది. డ్రోగో డ్రోన్స్ సంస్థ ఇటీవల స్వేయింగ్ , మ్యాపింగ్ లలో సేవలు అందచేస్తోంది. డ్రోన్ల తయారీకి అవసరమైన సర్టిఫికెట్ ను కేంద్ర సర్కార్ అందజేసింది. ఈ డ్రోన్లను హైదరాబాద్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో తయారు చేయనున్నారు.
ఈ సందర్బంగా డ్రోగో డ్రోన్స్ సంస్థ సిఇఓ యశ్వంత్ బొంతు మాట్లాడారు. ఎంతో కష్టపడి క్రిషి 2.0 ను ప్రపంచానికి పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు. తమ బృందం అంచనాలకు మించిన అద్భుతమైన డ్రోన్ ను రూపొందించామని అన్నారు. క్రిషి 2.0 వ్యవసాయ రంగంలో సంచలనం కలిగించనుందన్నారు.
Also Read : Purandeswari : పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్