Mukesh Kumar Meena: ఎన్నికల వేళ ఏపీలో రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం !

ఎన్నికల వేళ ఏపీలో రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం !

Mukesh Kumar Meena: ఎన్నికల వేళ ఏపీలో ఇప్పటి వరకు రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా(Mukesh Kumar Meena) వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్‌ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలను మరింత విస్త్రృుతం చేస్తున్నామని వివరించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్‌ఫోర్స్‌ మెంట్‌(ED) ఏజెన్సీలతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వ్యవహరించాలని బృందాలను ఆదేశించినట్లు సీఈవో వివరించారు.

Mukesh Kumar Meena Comment

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచడం జరిగిందన్నారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారాను మరియు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఇడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావింతం చేసే వస్తువులపై నిరంతరం నిఘా కాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

ఇందులో కేవలం గత 24 గంటల్లోనే రూ. 197.66 లక్షల విలువైన వస్తువులను జప్తుచేయడం జరిగిందన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటి నుండి నేటి వరకూ చేయబడిన మొత్తం జప్తులో రూ. 2,503.13 లక్షల నగదు, రూ.1,249.68 లక్షల విలువైన 6,14,837.76 లీటర్ల లిక్కర్, రూ.205.94 లక్షల విలువైన 68,73,891.25 గ్రాముల డ్రగ్స్ ను, రూ.5,123.58 లక్షల విలువైన 11,54,618.90 గ్రాముల ప్రెషస్ మెటల్స్ను, రూ.242.94 లక్షల విలువైన 4,71,020 ఫ్రీ బీస్ను (ఉచితాలను) మరియు704.66 లక్షల విలువైన 9,84,148.09 ఇతర వస్తువులను జప్తుచేయడం జరిగిందని ఆయన తెలిపారు.

Also Read : Rajnath Singh: పాకిస్తాన్ కు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌ !

Leave A Reply

Your Email Id will not be published!