NCERT Removes : ఆర్ఎస్ఎస్..గాడ్సే భాగాలు తొలగింపు
మొఘల్ చరిత్ర తొలగించిన ఎన్సీఆర్టీ
NCERT Removes : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం దెబ్బకు అన్నీ మారి పోతున్నాయి. ఇప్పటికే పలు చారిత్రిక ప్రాంతాలకు ఉన్న పేర్లను తొలగిస్తూ వచ్చింది. తాజాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఆర్టీ)(NCERT) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు 12వ తరగతి పొలిటికల్ సైన్స్ , హిస్టరీ పాఠ్య పుస్తకాలలో మహాత్మా గాంధీ హిందూ ముస్లిం ఐక్యత కోసం హిందూ తీవ్రవాదుల పట్ల ఇష్టపడని సూచనలను తొలగించింది.
స్వాతంత్రం నుండి భారత దేశంలో రాజకీయాలు అనే శీర్షికతో ఉన్న భాగాలలో కీలకమైన అంశాలను పక్కన పెట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఎంపీలు ఓవైసీ, కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు.
మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సే ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం బీజేపీ పవర్ లో ఉంది. మహాత్ముడి హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ ని నిషేధించింది. గాడ్సే గురించి బ్రాహ్మణ ప్రస్తావనను విరమించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రస్తావనను తొలగించింది ఎన్సీఆర్టీ. 2023-24 విద్యా సంవత్సరానికి కౌన్సిల్ ప్రచురించిన సవరించిన పాఠ్య పుస్తకాలు ఈ మార్పులను ప్రతిబింబిస్తాయి. మహాత్మా గాంధీ త్యాగం అనే ఉప అంశం నుండి అనేక పేరాలు తొలగించారు.
అంతే కాకుండా 12వ తరగతి చరిత్ర పాఠ్య పుస్తకంలో ఇండియన్ హిస్టరీలో థీమ్స్ -3 అనే శీర్షికలో మహాత్మా గాంధీ అండ్ ది నేషనలిస్ట్ మూవ్ మెంట్ అధ్యాయంలో ఒక పేరాను సవరించింది ఎన్సీఆర్టీ(NCERT Removes). అంతే కాదు మొఘల్ లకు చెందిన అధ్యాయాలను తొలగించింది.
Also Read : చైనా వర్తమానాన్ని చెరిపేస్తోంది – ఓవైసీ