Dasun Shanaka : కేన్ స్థానంలో ద‌సున్ ష‌న‌క ఎంపిక‌

ప్ర‌క‌టించిన గుజ‌రాత్ టైటాన్స్

Dasun Shanaka : 16వ ఐపీఎల్ సీజ‌న్ లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో తీవ్రంగా గాయ‌ప‌డిన కీవీస్ స్టార్ క్రికెట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ ఆట నుంచి వైదొలిగాడు. స్టిక్స్ సాయంతో న‌డుస్తుండ‌డంతో వైద్యులు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన గుజ‌రాత్ టైటాన్స్ మేనేజ్ మెంట్ కు బిగ్ షాక్ త‌గిలింది.

దీంతో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది యాజ‌మాన్యం. కేన్ విలియ‌మ్స‌న్ స్థానంలో శ్రీ‌లంక‌కు చెందిన స్టార్ ప్లేయ‌ర్ ద‌సున్ ష‌న‌క‌ను ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా వెల్ల‌డించింది. అంత‌కు ముందు ఆసిస్ స్టార్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ ను తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అనూహ్యంగా ద‌సున్ ష‌న‌క వైపు మొగ్గు చూపింది గుజ‌రాత్ టైటాన్స్.

ఐపీఎల్ లో తొలి ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం విశేషం. ప్రాథ‌మిక ధ‌ర రూ. 50 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించింది. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్ గా ద‌సున్ ష‌న‌క(Dasun Shanaka) ఉన్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన సీరీస్ లో అద్భుతంగా ఆడాడు. 187 స్ట్రైక్ రేట్ తో 124 ర‌న్స్ చేశాడు. వ‌న్డే సీరీస్ లో 121 ప‌రుగులు చేశాడు.

ఐపీఎల్ టోర్నీలో గాయంతో కేన్ ను కోల్పోయినందుకు బాధ‌గా ఉంది. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాం. మైదానంలో విలియ‌మ్స‌న్ ఆట చూస్తామ‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నాడు గుజ‌రాత్ టైటాన్స్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ సోలంకి.

Also Read : ఢిల్లీకి షాక్ గుజ‌రాత్ గ్రాండ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!