Pawan Kalyan: పిఠాపురం కొత్త ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు !

పిఠాపురం కొత్త ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు !

Pawan Kalyan: పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయడం ద్వారా క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలని… రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని, ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో నూతనంగా తీసుకున్న ఇంట్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని, క్రోధి నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

Pawan Kalyan – పిఠాపురంలో పవన్‌ కు 65వేల మెజార్టీ ఖాయం – రఘురామకృష్ణ రాజు

అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొని, స్వర్ణాంధ్రప్రదేశ్‌ గా అభివృద్ధి చేద్దామని నర్సాపురం ఎంపీ, టీడీపీ నేత రఘురామ కృష్ణరాజు అన్నారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో(Pawan Kalyan) ఆయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ… పవన్‌, నాగబాబుతో మంచి సంబంధాలున్నాయని, ఎక్కడి నుంచి పోటీ చేసినా… పవన్‌ తన తరఫున ప్రచారం చేస్తారని అన్నారు. జగన్‌ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో జనసేనానికి 65వేల ఓట్ల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ !

Leave A Reply

Your Email Id will not be published!