Nara Chandrababu Naidu: విరాళాల సేకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ను ప్రారంభించిన చంద్రబాబు !

విరాళాల సేకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ను ప్రారంభించిన చంద్రబాబు !

Nara Chandrababu Naidu: ఐదేళ్ళ వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకోవడానికి ఎన్ఆర్ఐలు కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్‌ఆర్‌ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడమే కాకుండా ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని కోరారు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగమని ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విరాళాల సేకరణకు ప్రత్యేకంగా https://tdpforandhra.com అనే వెబ్‌ సైట్‌ ని చంద్రబాబు(Nara Chandrababu Naidu) ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ద్వారా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి చందాగా రూ. 99,999 రూపాయల విరాళాన్ని చంద్రబాబు పార్టీకి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్‌ఆర్‌ఐలకోసం వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించినట్టు చెప్పారు. విరాళాలు ఇచ్చిన వారికి రశీదులు కూడా ఇస్తామన్నారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్‌ చాలా సులువు అవుతుందన్నారు. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉందన్నారు.

Nara Chandrababu Naidu New Website

పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల దగ్గర్నుంచే తాము విరాళాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరించిందని ఆయన మండిపడ్డారు. అందుకే ఆన్‌ లైన్‌ గ్యాంబ్లింగ్‌ కు అనుమతించాలని సమయం కోసం వైసీపీ ఎదురు చూసిందని దుయ్యబట్టారు. వైసీపీకు ఓటమిపై స్పష్టత రావడంతోనే సిట్‌ కార్యాలయంలో పత్రాలు తగులబెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధం సభలకు కనీసం రూ.15 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. 420లంతా కలిసి ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌ తో పాటు అనేక తప్పుడు కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా చిత్ర విచిత్ర వేషాలేస్తారని వెల్లడించారు. ప్రతి రోజూ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కంటైనర్లలో డబ్బులు వెళ్తూనే ఉన్నాయన్నారు.

‘‘రాష్ట్ర ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ధ్యేయంతో 3 పార్టీలు ముందుకు వచ్చాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. రాష్ట్రంలో ఒకే ఒక్కడు బాగుపడ్డాడు.. 5 కోట్ల మంది నష్టపోయారు. ఎన్నికల్లో ప్రచారం ఒక భాగమైతే.. ప్రలోభాలు మరో భాగం. సంపద సృష్టించడమే కాదు.. ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి’’ అని చంద్రబాబు అన్నారు.

Also Read : Pawan Kalyan: పిఠాపురం కొత్త ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు !

Leave A Reply

Your Email Id will not be published!