Rahul Gandhi : పొలం ప‌నుల్లో రాహుల్ గాంధీ బిజీ

నెట్టింట్లో ఫోటో వైర‌ల్

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ రోజు రోజుకు మ‌రింత రాటు దేలుతున్నారు. హ‌ర్యానా రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. తాను ప్ర‌జా నాయ‌కుడిన‌ని నిరూపించుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న అమెరికాలో ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌తో క‌లిసి ప్ర‌యాణం చేశారు. అంత‌కు ముందు ఢిల్లీ నుంచి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని సిమ్లా వ‌ర‌కు లారీలో జ‌ర్నీ చేశారు. ఇదే స‌మ‌యంలో డ్రైవ‌ర్ల‌తో ముచ్చ‌టించారు. దేశ రాజ‌ధాని హ‌స్తిన‌లో మెకానిక్ ల వ‌ద్ద‌కు వెళ్లారు. బైక్ రిపేర్లు చేసే వారి స‌మ‌స్య‌ల‌ను విన్నారు.

తాజాగా నెట్టింట్లో వైర‌ల్ గా మారారు. హ‌ర్యానా టూర్ లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో ప‌ర్య‌టించారు. ఉన్న‌ట్టుండి విస్తు పోయేలా చేశారు. ఆయ‌న పొలం ప‌నుల్లో నిమ‌గ్న‌మైన రైతులు, కూలీలతో క‌లిసి పోయారు. వారితో పాటు పొలాల్లోకి దిగారు. ఆ వెంట‌నే నాట్లు వేశారు. అంతే కాదు ట్రాక్ట‌ర్ ను న‌డిపారు. తాను కూడా సామాన్యుడినేన‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ అత్యంత జ‌నాద‌ర‌ణ నాయ‌కుల్లో ఒక‌డిగా గుర్తింపు పొందారు. త‌న‌ను తాను ప్రూవ్ కూడా చేసుకున్నారు. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఆనాటి భార‌త సంగ్రామ యాత్ర‌ను గుర్తుకు తీసుకు వ‌చ్చేలా చేసింది. ప్ర‌ధాని మోడీని ఏకి పారేశారు. దేశంలో కొలువు తీరిన బీజేపీ స‌ర్కార్ దాష్టీకాల‌ను ప్ర‌శ్నిస్తూ వ‌చ్చారు. నిన్న‌టి దాకా ప‌ప్పూ అని అన్న వారే ఇప్పుడు రాహుల్ నాయ‌క‌త్వ నైపుణ్యాన్ని చూస్తి ఔరా అంటున్నారు.

Also Read : ED Attaches : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఆస్తులు జ‌ప్తు

 

Leave A Reply

Your Email Id will not be published!