Ravela Kishore Babu: వైసీపీలో చేరిన రావెల కిషోర్ బాబు !

వైసీపీలో చేరిన రావెల కిషోర్ బాబు !

Ravela Kishore Babu: మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. సీఎం జగన్ రావెలకు వైసీపీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. రావెల కిషోర్ బాబుతో… అతని భార్య, కుటుంబ సభ్యులతో పాటు ఎంపీ నందిగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ… ‘‘అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్న ఏకైక నాయకుడు సీఎం జగన్(CM YS Jagan). పేద, బడుగు, బలహీన వర్గాల రాజకీయ కలను జగన్ సాకారం చేస్తున్నారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేదల ఖాతాలో జమ చేయటం ఒక చరిత్ర. డ్వాక్రా మహిళలను గత పాలకులు ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. జగన్ మాత్రం వారి రుణాలను విడతల వారీగా మాఫీ చేశారు . అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా జగన్ చూస్తున్నారు. పేదలకు చేస్తున్న సేవలను చూసి వైఎస్సార్‌సీపీలో చేరాను. పార్టీ కోసం జగన్‌ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం. ఒక విధేయుడిగా ఉంటా,” అని తెలిపారు.

Ravela Kishore Babu Join in YSRCP

ఐఆర్టీఎస్ మాజీ అధికారి అయిన రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు (ఎస్సీ) నుండి పోటీ చేసిన గెలుపొందారు. ఆ తరువాత చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసారు. 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఎన్నికల అనంతరం జనసేన నుండి బీజేపీలోనికి జంప్ అయ్యారు. కొంతకాలం క్రితం బీజేపీ నుండి తెలంగాణా సీఎంగా కేసీఆర్ కొత్తగా ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో చేరిన రావెల… బుధవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

Also Read : Vote from Home for Disabled: దివ్యాంగులకు ఇంటి వద్దకే ఓటు !

Leave A Reply

Your Email Id will not be published!