#Krack: ధియేటర్లు పెంచుకు పోతున్న క్రాక్
Ravi Teja krack in more theaters
Krack : సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో మసాలా ఎంటర్టైనర్ “క్రాక్”అనూహ్య విజయాన్ని అందుకోవటంతో పాటు విడుదలైన అన్ని కేంద్రాలలో కేవలం 50 శాతం సీటింగ్ తోనే బ్రేక్ ఈవెన్ చేసి దూసుకుపోతుండటంతో ధియేటర్లకు వస్తున్న క్రౌడ్‌ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని ధియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు డిస్టిబ్యూటర్లని , ధియేటర్ యాజమాన్యాలను కోరినట్టు సమాచారం.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే స్యూర్ షాట్ మాస్ హిట్ అయ్యింది. అనేక రూమర్లు సినిమాపై వచ్చినా ప్రక్షకుల నుంచి రెస్పాన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు మరిన్ని థియేటర్ లు పెంచుతుండటంతో మరెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందోనని రవితే అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
No comment allowed please