చెల‌రేగిన ఆర్సీబీ బౌల‌ర్లు చేతులెత్తేసిన ఢిల్లీ

9 వికెట్ల తేడాతో రాయ‌ల్స్ అద్భుత విజ‌యం

ఢిల్లీ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య జ‌ట్టు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు చుక్క‌లు చూపించింది. మిస్సైల్స్ లాంటి బంతుల‌తో వ‌ణికించారు ఆర్సీబీ బౌల‌ర్లు. దెబ్బ‌కు ఆడ‌లేక వికెట్ల‌ను స‌మ‌ర్పించుకున్నారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ల్ప స్కోర్ 75 ర‌న్స్ కే చాప చుట్టేశారు. దీంతో కేవ‌లం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 9 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి చేరి పోయింది. ఇదిలా ఉండ‌గా ఈ టోర్నీలో చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా త‌మ‌ను ఓడించినందుకు గాను ప‌నిగ‌ట్టుకుని ప్ర‌తీకారం తీర్చుకుంది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు.

మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది ఢిల్లీ క్యాపిట‌ల్స్. మొన్న‌టి మ్యాచ్ లో విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్ తో ఆక‌ట్టుకున్న కేఎల్ రాహుల్, నితీశ్ రానా , త‌దిత‌ర ఆట‌గాళ్లు ఈ మ్యాచ్ లో చేతులెత్తేశారు. ప్రధానంగా ఆర్సీబీ బౌల‌ర్లు హాజిల్ వుడ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ల మిస్సైల్స్ లాంటి బంతుల‌తో బెంబేలెత్తించారు. హాజిల్ వుడ్ దెబ్బ‌కు ఢిల్లీ బ్యాట‌ర్లు విల విల లాడారు. త‌ను కేవ‌లం 12 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక భువ‌నేశ్వ‌ర్ కుమార్ 5 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో 16.3 ఓవ‌ర్ల‌లో 75 ప‌రుగులకే ఆలౌట్ అయ్యింది. అభిషేక్ పోర‌ల్ 30 ర‌న్స్ చేయ‌గా మిల్ల‌ర్ 19 ర‌న్స్ మాత్ర‌మే చేశారు. లేక పోతే ఆ స్కోర్ కూడా అయి ఉండేది కాదు. ఇక ఆర్సీబీ 6.3 ఓవ‌ర్ల‌లో ప‌డిక్క‌ల్ 34 , కోహ్లీ 24 ర‌న్స్ చేసి జ‌ట్టుకు విజ‌యాన్ని ఆడుతూ పాడుతూ క‌ట్ట‌బెట్టారు.

Leave A Reply

Your Email Id will not be published!