Ratan Tata Phone Call : ఆ కంపెనీని మార్చేసిన ఫోన్ కాల్
రెపోస్ ఎనర్జీకి రతన్ టాటా సపోర్ట్
Ratan Tata Phone Call : పూణేకి చెందిన స్టార్టప్ రెపోస్ ఎనర్జీ ఫౌండర్ కు ఊహించని రీతిలో దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా నుంచి ఫోన్ కాల్ రావడం చర్చకు దారి తీసింది. రెపోస్ ఎనర్జీ దేశం మొత్తం ఇంధన వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
టాటా మోటార్స్ నుండి రెండో రౌండ్ పెట్టుబడిని అందుకున్న నెలల తర్వాత కాల్ రావడం కలకలం రేపింది. ఈ ఒక్క ఫోన్ కాల్(Ratan Tata Phone Call) సదరు కంపెనీకి ప్రాచుర్యం కల్పించేలా చేసింది.
ఇదే విషయాన్ని రెపోస్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు పంచుకున్నారు. రెపోస్ ఎనర్జీ అనేది మహారాష్ట్రలోని పూణేకి చెందిన అంకుర కంపెనీ.
ఈ కంపెనీ యాప్ ద్వారా డీజిల్ ను ఇంటింటికి డెలివరీ చేస్తుంది.
పంపిణీ నమూనాను ప్రాచుర్యంలోకి తీసుకు రావడం ద్వారా దేశం మొత్తం ఇంధన వినియోగాన్ని తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కో ఫౌండర్ అదితి భోసలే వాలుంజ్ రతన్ టాటాతో తన భేటిని పంచుకున్నారు.
కొన్ని సంవత్సరాల కిందట తాను , తన భర్త చేతన్ వాలుంజ్ రెపోస్ ను ప్రారంభించారు. తమ సంస్థ ఎదగడానికి వారికి ఒక మెంటార్ అవసరమని కనుగొన్నారని తెలిపారు.
ఎలాగైనా సరే దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటాను కలవాలని పేర్కొంది తన భర్తతో. మా ఇద్దరికీ ఎలాంటి అధికారిక వ్యాపార విద్య లేదు. కానీ
జీవితంలో ఏదో ఒకటి సాధించాలని శపథం చేశాం.
మీరు రతన్ టాటాను కలవలేరంటూ , అది అసాధ్యమంటూ చాలా మంది మమ్మల్ని నిరుత్సాహ పరిచారు. మేం మా సంస్థ ఏం చేస్తుందో
వివరిస్తూ లేఖ రాశామని , రాత్రి 10 గంటల సమయంలో తనకు కాల్ వచ్చిందని అదితి చెప్పింది.
నేను రతన్ టాటా. మీ ఉత్తరం నాకు అందింది. మనం కలుసుకోగలమా అని ఫోన్ లో అడిగారు. ఉదయం టాటా ఇంటికి చేరుకున్నాం.
ఉదయం 11 గంటలకు వచ్చారు రతన్ టాటా. నానుండి మీరు ఏమి ఆశిస్తున్నారంటూ టాటా ప్రశ్నించారు.
ప్రజలకు సేవ చేయడంలో మాకు సాయం చేండి. దేశాన్ని ప్రపంచానికి తీసుకు వెళ్లేలా మార్గ నిర్దేశం చేయాలని కోరామన్నారు.
Also Read : ఆర్యా వాల్వేకర్ మిస్ ఇండియా యుఎస్ విజేత