Rythu Bandhu : 28న రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు
నిధులు విడుదలకు సర్కార్ నిర్ణయం
Rythu Bandhu : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం నిధుల విడుదలకు సంబంధించి ఉన్న అడ్డంకిని తొలగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు ఈనెల 28న ముహూర్తం నిర్ణయించింది. నిధులను విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
Rythu Bandhu will be Released
రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతు బంధు(Rythu Bandhu) పథకాన్ని ఉపయోగించు కుంటుందోనని సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాము ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతు బంధు రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరామని కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా ప్రజలు, రైతులు, యువత తమను గెలిపించాలని డిసైడ్ అయ్యారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు రేవంత్ రెడ్డి. ఆయన ఓ ఛానల్ తో బిగ్ డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈసీ పర్మిషన్ ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తేలి పోయిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.
Also Read : Pawan Kalyan : తాండూరులో పవన్ హల్ చల్