LPG Connection Price Hike : కనెక్షన్ తీసుకోవాలంటే కన్నీళ్లే
బండబడ మళ్లీ గ్యాస్ గుదిబండ
LPG Connection Price Hike : మన్ కీ బాత్ అంటూ చిలుక పలుకులు చెబుతున్న కేంద్ర సర్కార్ గ్యాస్ వినియోగారులకు కోలుకోలేని షాక్ ఇస్తూ వస్తోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధర రూ. 1100కు పైగా చేరింది.
ఇంకో వైపు పెట్రోల్, గ్యాస్ ధరలు(LPG Connection Price Hike) ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే వంట, కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చుక్కలు చూపించిన కేంద్రం తాజాగా మరో మోత మోగించేందుకు సిద్దమైంది.
కొత్తగా గ్యాస్ అవసరమైన వారికి కనెక్షన్లు ఇవ్వాలంటే భారీగా చెల్లించాల్సి ఉంటుంది. వన్ టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉండేది.
కానీ దానిని కూడా పెంచాలని చమురు , గ్యాస్ సంస్థలు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు విన్నవించింది. ఈ ప్రతిపాదనకు ఆ శాఖ పర్మిషన్ ఇచ్చింది.
ఇంకేం మరో భారం మీద పడనుందన్నమాట. ఈ విషయాన్ని అధికారికంగా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సబ్సిడీ దుర్వినియోగం జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉండ కూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది శాఖ. ఇప్పటి వరకు వంట కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్(LPG Connection Price Hike) 14.2 కిలోలకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ కింద గ్యాస్ కంపెనీ రూ. 1450 తీసుకునే వారు.
ఇక తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో రూ. 2,500కు పైగానే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే అనుకుంటే పొరపాటు పడినట్లే. మిగతా సర్వీస్ చార్జీల మోత కూడా మోగనుంది.
Also Read : ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా