కేటీఆర్ తో సౌత్ కొరియా అడ్వైజ‌ర్ యంగ్గే చో భేటీ

ఆనందంగా ఉంద‌న్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

హైద‌రాబాద్ : దక్షిణ కొరియా అధ్యక్షుడి సలహాదారు ప్రొఫెసర్ యంగ్టే చో , సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై వీరు చ‌ర్చించారు. ప్రొఫెసర్ యంగ్టే చో సియోల్ నేషనల్ యూనివర్సిటీ లో జనాభా శాస్త్రంలో విశిష్ట ప్రొఫెసర్ . అంతే కాకుండా దాని జనాభా విధాన పరిశోధన కేంద్రం డైరెక్టర్ కూడా. ప్రొఫెసర్ చో దక్షిణ కొరియాలోని వృద్ధాప్య సమాజం , జనాభా విధానంపై అధ్యక్ష కమిటీ , అధ్యక్ష జాతీయ ఆర్థిక సలహా మండలితో సహా కీలకమైన అధ్యక్ష సలహా సంస్థలలో పని చేస్తున్నారు.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుండి ప్రపంచ జ్ఞానం, సాంకేతిక శక్తిగా కొరియా సాగించిన అద్భుతమైన ప్రయాణం ఎల్లప్పుడూ స్ఫూర్తి దాయకంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌లు కురిపించారు. తాను మంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ కొరియా అనుభవం నుండి నేర్చుకోవాలని త‌న‌ బృందానికి తరచుగా చెప్పేవాడినని పేర్కొన్నారు. తెలంగాణ తన నైపుణ్యం గల ప్రతిభ, ప్రగతిశీల విధానాలు, బలమైన పర్యావరణ వ్యవస్థతో కొరియన్ కంపెనీలకు అపారమైన అవకాశాలను అందిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము యంగ్‌వన్ కార్పొరేషన్ , హ్యుందాయ్ వంటి ప్రముఖ కొరియన్ కంపెనీలను స్వాగతించామని గుర్తు చేశారు ఈ సంద‌ర్బంగా.

భారతదేశ జనాభా డివిడెండ్ ప్రపంచ వ్యాపారాలకు భారీ మార్కెట్‌ను సృష్టిస్తూనే ప్రపంచం కోసం నిర్మించడానికి మనకు ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుందన్నారు కేటీఆర్. సాంకేతికత, పరిశ్రమ, ఆవిష్కరణ రంగాలలో తెలంగాణ-కొరియా సహకారం మరింత బలపడాలని తాను ఆశిస్తున్నాన‌ని అన్నారు. .

Leave A Reply

Your Email Id will not be published!