SS Raja Mouli : దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ పురస్కారం అందుకుంది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. స్కిప్టు కూడా ఓకే అయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా రాజమౌళి ఎక్కువగా ఆలయాలు, ప్రకృతిని ప్రేమిస్తాడు. అంతే కాదు ఏదో ఒకటి తెలుసు కోవాలన్న తపన కూడా ఎక్కువే.
SS Raja Mouli Trip with His Wife
ఏ మాత్రం సమయం ఉన్నా వెంటనే నచ్చిన దేశాలు, ప్రదేశాలను ఎంపిక చేసు కోవడం ఆపై విహారం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. జీవితం చిన్నది. అంతలోనే ఉన్న వాటిని పరిశీలించడం, ఆకళింపు చేసుకోవడం, నేర్చుకోవడం చేయాలంటారు దర్శకుడు రాజమౌళి.
తాజాగా తన భార్యతో కలిసి నార్వేలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజమౌళి(SS raja Mouli)తో పాటు భార్య కూడా ప్రకృతి ప్రేమికురాలు. ఎక్కువగా పుస్తకాలు కూడా చదువుతారు. సినిమాలే తమకు ప్రపంచమని చెప్పే రాజమౌళి వీలైనంత మేరకు కుటుంబంతో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడతారు. మొత్తంగా రాజమౌళిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదూ.
Also Read : Jailer Record : జైలర్ రికార్డుల మోత కలెక్షన్ల వేట