DK Shiva Kumar : సుధా మూర్తి ఎంద‌రికో స్పూర్తి – డీకే

డిప్యూటీ సీఎం పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

DK Shiva Kumar : ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ అధ్య‌క్షురాలు , ర‌చ‌యిత్రి, ప‌ద్మశ్రీ పుర‌స్కార గ్ర‌హీత సుధా మూర్తి పుట్టిన రోజు ఇవాళ‌. ఆగ‌స్టు 19 సంద‌ర్భంగా ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్(DK Shiva Kumar). ఆమె ఆరోగ్యంగా ఉండాల‌ని కోరారు. సామాజిక సేవ‌లో నిరంత‌రం నిమ‌గ్నం అయ్యే సుధా మూర్తి జీవితం స్పూర్తి దాయక‌మ‌ని పేర్కొన్నారు డీకే.

DK Shiva Kumar Wishes to Infosys Sudha Murthy

ఇదిలా ఉండ‌గా ఆమెకు ఇవాల్టితో 72 ఏళ్లు పూర్త‌య్యాయి. ఆమె భ‌ర్త నారాయ‌ణ మూర్తి ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ చైర్మ‌న్. ఇక కూతురు అక్ష‌త మూర్తి ఎవ‌రో కాదు ప్ర‌స్తుతం యునైటెడ్ కింగ్ డ‌మ్ ప్ర‌ధాని రిషి సున‌క్ భార్య‌. భార‌త దేశంలో పేరు పొందిన సంఘ సేవ‌కురాలు. అంతే కాదు ర‌చయిత్రిగా గుర్తింపు పొందారు. ఆమె కంప్యూట‌ర్ ఇంజ‌నీర్ గా జీవితాన్ని ప్రారంభించారు.

ప‌లు అనాధ ఆశ్ర‌మాల‌ను ప్రారంభించింది. గ్రామీణ అభివృద్దికి దోహ‌దం చేసింది. క‌ర్ణాట‌క లోని అన్ని ప్ర‌భుత్వ బ‌డుల‌కు కంప్యూట‌ర్లు అంద‌జేసింది. పేద విద్యార్థుల‌కు ఉచితంగా కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం అందేలా కృషి చేసింది సుధా మూర్తి. అంతే కాదు హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో భార‌తీయ గ్రంథాల‌తో ది మూర్తి క్లాసిక‌ల్ లైబ్ర‌రీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. డాల‌ర్ సాసే పేరుతో న‌వ‌ల రాశారు.దీనిని జీ టీవీలో 2001లో ప్ర‌సారం చేశారు.

Also Read : SS Raja Mouli : నార్వేలో రాజ‌మౌళి సంద‌డి

Leave A Reply

Your Email Id will not be published!