Rahul Rameshwar Viral : రాహుల్ రామేశ్వ‌ర్ వైర‌ల్

కాంగ్రెస్ పోస్టు హ‌ల్ చ‌ల్

Rahul Rameshwar Viral : వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ హాట్ టాపిక్ గా మారారు. కూర‌గాయ‌ల వ్యాపారి యూపీకి చెందిన రామేశ్వ‌ర్ జీని రాహుల్ ఆద‌రించారు. ఆయ‌న‌ను త‌న ఇంటికి పిలిపించారు. అంతే కాదు భార్య‌, కూతురిని కూడా ఆహ్వానించారు. ఢిల్లీ లోని కూర‌గాయ‌ల మార్కెట్ లో కూర‌గాయలు అమ్ముకునే వాడు. త‌న కోరిక ఒక్క‌టే రాహుల్ గాంధీని క‌ల‌వ‌డం. స్వ‌త‌హాగా రాహుల్ గాంధీ రామేశ్వ‌ర్ ఫ్యామిలీకి వ‌డ్డించ‌డం. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Rahul Rameshwar Viral in Social Media

రామేశ్వ‌ర్ జీ క‌థ దేశంలోని కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను క‌దిలించింది. కంట త‌డి పెట్టించేలా చేశాయి. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాదిలో రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను చేప‌ట్టారు. దేశంలోని వివిధ సామాజిక వ‌ర్గాల‌ను క‌లిశారు. వారితో సంభాషించారు. వారి స‌మ‌స్య‌ల‌ను విన్నారు. వారి క‌న్నీళ్ల‌ను తుడిచే ప్ర‌య‌త్నం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఈ యాత్ర‌తో దేశంలోనే మోస్ట్ పాపుల‌ర్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా సామాన్యులను ప‌ల‌క‌రించే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ శ‌నివారం అద్భుత‌మైన పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించి రామేశ్వ‌ర్ ను రాహుల్ క‌లిస్తే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీతో మాత్ర‌మే క‌లిసిన ఫోట‌ను జ‌త చేసింది.

Also Read : DK Shiva Kumar : సుధా మూర్తి ఎంద‌రికో స్పూర్తి – డీకే

Leave A Reply

Your Email Id will not be published!