Raithu Bandhu Release : రైతులకు సర్కార్ ఖుష్ కబర్
నేటి నుండి రైతు బంధు విడుదల
Raithu Bandhu Release : తెలంగాణ ప్రభుత్వం వెంట వెంటనే నిధులను విడుదల చేస్తోంది. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే మూడోసారి పవర్ లోకి రావాలని కోరుకుంటోంది. ఈ తరుణంలో ఎప్పటి లాగే రైతు బంధు నిధులను విడుదల చేసింది. సోమవారం నుంచే జమ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆయా బ్యాంకులలో ఖాతాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూ. 7,720 కోట్లు విడుదల చేసింది.
అంతే కాకుండా కొత్తగా 5 లక్షల మంది పోడు భూమి రైతులకు కూడా రైతు బంధు(Raithu Bandhu) అమలు చేస్తోంది. ఇప్పటి దాకా 11 విడతల్లో కలిపి రూ. 72 వేల 910 కోట్లు రైతులకు పెట్టుబడి సాయంగా జమ చేసింది. రైతులతో పాటు బీసీలకు బీసీ బంధు కూడా ప్రవేశ పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇదిలా ఉండగా రైతు బంధుకు సంబంధించి సర్కార్ ఇవాళ తెల్లారేసరికి ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. దీంతో రాష్ట్రంలోని రైతులంతా సంతోషానికి లోనవుతున్నారు. వారందరి ఫోన్లు మోగుతున్నాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు సర్కార్ సాయం ఒకింత ఆసరాను ఇస్తోంది.
ఇక రైతు బంధు పథకంలో భాగంగా గుంట భూమి నుంచి ఒక ఎకరం కలిగిన రైతులకు వారి ఖాతాల్లో రైతు బంధు కింద నిధులను జమ చేసింది. మొత్తం 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ. 642.52 కోట్ల నగదు జమ కావడం విశేషం. కాగా సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. జూన్ 26 నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశించారు సీఎం.
Also Read : Nikhath Zareen : క్రీడా ప్రాంగణం జరీన్ సంతోషం