బ్యాలెట్ ప‌త్రాల విధానాన్ని ప్ర‌వేశ పెట్టాలి : రాజ్ ఠాక్రే

అక్ర‌మ స‌ర్ ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేయాలని డిమాండ్

ముంబై : మ‌హా న‌వ నిర్మాణ సంస్థ (ఎంఎన్ఎస్) పార్టీ అధ్య‌క్షుడు రాజ్ ఠాక్రే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై మండిప‌డ్డారు. అక్ర‌మ ప‌ద్ద‌తిలో సీఈసీ తీసుకు వ‌చ్చిన స‌ర్ ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు రాజ్ ఠాక్రే. ఈ సంద‌ర్బంగా ఈ కీల‌క సూచ‌న‌లు చేశారు. బ్యాలెట్ పత్రాల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని అన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ‘గర్జన మోర్చా’ ర్యాలీలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు పాల్గొన్నారు . భారత ఎన్నికల సంఘానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. రెండు కీలక డిమాండ్లను లేవనెత్తారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయడం , భవిష్యత్తు ఎన్నికలన్నింటిలోనూ పేపర్ బ్యాలెట్లను తిరిగి ప్రవేశ పెట్టడం ముఖ్య‌మ‌న్నారు రాజ్ ఠాక్రే.

భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజ్ ఠాక్రే ప్రస్తుతం జరుగుతున్న స‌ర్ ప్రక్రియ చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నించారు. మాజీ కేంద్ర హోం కార్యదర్శి ఆర్.కె. సింగ్ గతంలో వ్యక్తం చేసిన న్యాయపరమైన అభిప్రాయాలను ప్రస్తావించారు. నిర్దిష్ట చట్టపరమైన మద్దతు లేకుండా దేశవ్యాప్తంగా స‌ర్ ప్రక్రియను చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఎంఎన్ఎస్ అధినేత ప్రకటించారు.ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు లేదా భారీ స్థాయిలో జనాభా తరలింపు వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే, అదీ లిఖితపూర్వక కారణాలతో నిర్దిష్ట నియోజకవర్గాలకు మాత్రమే ‘ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్’ నిర్వహించవచ్చు అని రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఏకపక్షంగా స‌ర్ నిర్వహించడం చట్టవిరుద్ధం అన్నారు. ఈ చట్టంలో దీనికి ఎటువంటి నిబంధన లేదన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!