Tummala Nageswara Rao : గులాబీకి తుమ్మల గుడ్ బై
పార్టీ బాస్ , సీఎం కేసీఆర్ కు లేఖ
Tummala Nageswara Rao : హైదరాబాద్ – మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన ప్రకటన చేశారు. శనివారం తాను పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, చీఫ్ , ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పంపించారు.
Tummala Nageswara Rao Shocking Decision
తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నట్టుండి టీడీపీకి గుడ్ బై చెప్పారు.
సీఎం కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ప్రయారిటీ ఇచ్చారు తుమ్మలకు(Tummala Nageswara Rao). ఆ వెంటనే ఎమ్మెల్సీని చేశారు. కేబినెట్ లో చోటు కల్పించారు. ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు. కానీ అనుకోకుండా ఓటమి పాలయ్యారు.
పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి కొంత కాలం దూరంగా ఉంటూ వచ్చారు. ఇదే సమయంలో తాజాగా కేసీఆర్ త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో తుమ్మల నాగేశ్వర్ రావుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్థాపం చెందిన తుమ్మల వెంటనే కాంగ్రెస్ కు జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు.
Also Read : CWC Posters Viral : కరప్ట్ వర్కింగ్ కమిటీ పోస్టర్స్ వైరల్
