Vempalle Shareef: తెలుగునాట ప్రముఖ కథా రచయిత

తెలుగునాట ప్రముఖ కథా రచయిత వేంపల్లె షరీఫ్

వేంపల్లె షరీఫ్

Vempalle Shareef : వేంపల్లె షరీఫ్ (షేక్ మహమ్మద్ షరీఫ్): కడప జిల్లా వేంపల్లె లో జన్మించిన వేంపల్లె షరీఫ్(Vempalle Shareef) తెలుగునాట ప్రముఖ కథా రచయిత, జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. నిరుపేద ముస్లిం కుటుంబం నుండి వచ్చిన షరీఫ్… ఎస్టీడీ బూత్ లో బోయ్ గా, కొరియర్ బోయ్ గా, ఆటో డ్రైవర్ గా ఇలా ఎన్నో పనులు చేశారు. ఇంటర్మీడియట్ నుంచి రచనా వ్యాసంగం మొదలుపెట్టి షరీఫ్ తొలిరోజుల్లో చిన్న పిల్లల కథల రాశారు. 2003 నుంచి పూర్తి స్థాయిలో రచనలపై దృష్టిపెట్టారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వచ్చిన షేక్ మహమ్మద్ షరీఫ్ ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకుని వేంపల్లె షరీఫ్ రచనలు చేస్తున్నారు.

Vempalle Shareef – షరీఫ్ రచనా ప్రస్థానం

జుమ్మా కథల సంపుటితో రచయితగా షరీఫ్(Vempalle Shareef) మంచి గుర్తింపు పొందారు. హైదరాబాద్ లోని మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలోరాసిన కథ జుమ్మా. ఈ కథ పేరునే పుస్తకం శీర్షికగా పెట్టారు. ఈ జుమ్మా కథ హిందీ, ఇంగ్లీషు, మైథిలి, కొంకణి, కన్నడ భాషల్లోకి అనువాదించారు. రాయలసీమ గ్రామీణ ముస్లింల జీవితాన్ని కథలుగా మలుస్తూ ఆయా ముస్లిం కుటుంబాలలో చోటుచేసుకునే కొన్ని జీవిత విషయాలను తన దృష్టి కోణంలో రాసారు షరీఫ్. ఆనందాలు, ఆశలు, కట్టుబాట్లు, సాంఘిక జీవితంలో చోటు చేసుకొనే సంఘటనలను ఈ కథ లలో షరీఫ్ లోతుగా వివరించారు.
షరీఫ్ రచించిన జుమ్మా కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012 కు ఎంపికైంది. షరీఫ్ “తలుగు’పేరుతో ఒకే కథను నేరుగాపుస్తకంగా ఇటీవల ప్రచురించారు. దేశంలోని 40 మంది ఉత్తమ వర్థమాన కథలతో జాతీయ స్థాయిలో అలోఫ్ బుక్ కంపెనీ ప్రచురించిన ఉత్తమ కథల సంకలనం ‘ఏ కేస్ ఆఫ్ ఇండియన్ మార్వెల్స్’ ఆంగ్ల సంకలనంలో షరీఫ్ రచించిన ‘ఒంటిచేయి’ కథ స్థానం దక్కించుకుంది.

షరీఫ్ రచనలు

షరీఫ్ రచనల్లో జుమ్మా- కథల సంపుటి, తియ్యని చదువు- పిల్లల కథలు, కథామినార్, చోంగారోటీ, తలుగు, యువ ముఖ్యమైనవి.

.అవార్డులు

షరీఫ్ రచనలకు కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు భాషా పురస్కారం, చాసో సాహితీ స్ఫూర్తి పురస్కారంతో పాటు ఎన్నో పురష్కారాలు అందుకున్నారు.

Also Read : Umar Alisha: తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవి

Leave A Reply

Your Email Id will not be published!