YS Sharmila : ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో షర్మిల
పాదయాత్రలో అరుదైన రికార్డ్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల అరుదైన ఘనత సాధించారు. భారత దేశంలో అత్యధిక కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకురాలిగా, మహిళగా చరిత్ర సృష్టించారు. తాజాగా ఇదే విషయాన్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా మంగళవారం 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లో షర్మిల(YS Sharmila) కు ఆమె నివాసంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు మెడల్, జాతీయ పతాకం, మెమొంటోను అందజేశారు .
YS Sharmila Got Rear Award
ఇదిలా ఉండగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటారు. తన గొంతు విప్పారు. ప్రత్యేకించి తెలంగాణలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను, కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారు. అమర వీరుల కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిని ప్రశ్నించారు. సీఎంను నిలదీశారు. ఇదే సమయంలో సంచలన ప్రకటన చేశారు వైఎస్ షర్మిల.
తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తొలి మహిళగా రికార్డు బ్రేక్ చేశారు . ఆమెను అభినందించారు ప్రతినిధులు.
Also Read : DSP Sudhakar Reddy : సుధాకర్ రెడ్డికి ప్రెసిడెంట్ మెడల్