Lalit Modi Sushmitha Sen : లేటు వ‌య‌స్సులో ఘాటు ప్రేమ‌

సుస్మితా సేన్ తో ల‌లిత్ డేటింగ్

Lalit Modi Sushmita Sen : ప్రేమ ఎప్పుడు ఎవ‌రిని ఎలా ప‌ల‌క‌రిస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ప్రేమ అంటే రెండు గుండెల చ‌ప్పుడు. రెండు మ‌న‌స్సుల ఆలాప‌న‌. ఎవ‌రు ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ‌తారో ఎందుకు ప్రేమిస్తారో కూడా చెప్పలేం.

ప్రేమ‌కు ఉన్న శ‌క్తి అలాంటిది. ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ చీఫ్ గా ఉన్న ల‌లిత్ మోడీ. బాలీవుడ్ 

న‌టి సుస్మితా సేన్. ఇద్ద‌రూ డేటింగ్ లో ఉండ‌డం వారిద్ద‌రూ క‌లిసి ఫోటోలు షేర్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

భార‌త దేశంలో జ‌గ‌న్మోహ‌న్ దాల్మియా త‌ర్వాత క్రికెట్ కు అత్యంత జ‌నాద‌ర‌ణ తీసుకు వ‌చ్చిన వారిలో ల‌లిత్ మోడీ ఒక‌డు. ఆ త‌ర్వాత అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు రుజువు కావ‌డంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

దీంతో ఇండియాకు రాకుండా ఇంగ్లండ్ లోనే కొలువు తీరాడు ల‌లిత్ మోడీ. ఈ త‌రుణంలో ఇప్పుడు వార్త‌ల్లో వ్య‌క్తిగా మారాడు . ఇక ల‌లిత్ మోడీ

మాజీ మిస్ యూనివ‌ర్స్ సుస్మితా సేన్( Sushmita Sen) తో డేటింగ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఈ విష‌యాన్ని ట్వి్ట్ట‌ర్ వేదిక‌గా వెల్లడించాడు. త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్లు తెలిపాడు. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ షిప్ పై ఫుల్

క్లారిటీ కూడా ఇచ్చేశాడు ల‌లిత్ మోడీ.

ఇద్ద‌రూ బీచ్ లో, స‌ముద్రంపై స్టీమ‌ర్ క‌లిసి మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఉన్న ఫోటోల‌ను షేర్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇద్ద‌రూ లేటు వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డ‌డం హాట్ టాపిక గా మారింది.

ఎంత ఘాటు ప్రేమ‌యో పారిజాత‌మా అంటూ పాట‌లు పాడుకుంటున్నారు వీరిద్ద‌రూ. గ‌తంలో క్రికెట‌ర్లు, సినీ న‌టుల మ‌ధ్య ప్రేమాయ‌ణం కొత్తేమీ కాదు.

గంగూలీ న‌గ్మా, అజహ‌రుద్దీన్ సంగీత బిజ్ లానీ సంగ‌తి విదిత‌మే. మొత్తంగా ల‌లిత్ మోడీ(Lalit Modi) , సుస్మితా సేన్( Sushmita Sen) ఇద్ద‌రూ

ఒక్క‌టి కావాల‌ని కోరుకుందాం.

Also Read : ఇంగ్లండ్ భ‌ళా ఇండియా విల‌విల‌

Leave A Reply

Your Email Id will not be published!