Sushmita Sen : పెళ్లి చేసుకోలేదు కానీ ప్రేమ‌లో ఉన్నాం

ల‌లిత్ మోడీ డేటింగ్ పై సుస్మితా సేన్

Sushmita Sen : మాజీ విశ్వ‌సుంద‌రి, ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి సుస్మితా సేన్ ఒక్క‌సారిగా నెట్టింట్లో వైర‌ల్ గా మారారు. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) కు ప్రాణం పోసి దానికి ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో ఆద‌ర‌ణ తీసుకు వ‌చ్చేలా చేసిన ల‌లిత్ మోడీ ఉన్న‌ట్టుండి సుస్మితా సేన్ తో క‌లిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు.

అవి సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. గ‌తంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ల‌లిత్ మోడీ అవినీతి, అక్ర‌మాలు బ‌య‌ట‌కు పొక్క‌డంతో విచార‌ణ‌కు ఆదేశించింది స‌ర్కార్.

ఆయ‌న‌పై అరెస్ట్ వారెంట్ కూడా రెడీగా ఉంది. కానీ విదేశాల్లోనే స్థిర ప‌డ్డారు ఇండియాకు రాకుండా. ఈ త‌రుణంలో ల‌లిత్ మోదీ మొదటి భార్య క్యాన్స‌ర్ వ్యాధితో చ‌ని పోయింది.

అప్ప‌టి నుంచి ఆయ‌న ఒంట‌రిగానే ఉంటున్నారు. తాజాగా ఉన్న‌ట్టుండి మ‌రోసారి హాట్ టాపిక్ గా మారి పోయారు ల‌లిత్ మోదీ.

ఎందుకంటే అత్యంత ద‌గ్గ‌ర‌గా న‌టి సుస్మితా సేన్ తో ఉన్న ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారేమోన‌ని అనుమానం క‌లిగింది. దీనికి ల‌లిత్ మోది స్పందించాడు.

తామిద్ద‌రం ఎంజాయ్ చేస్తున్నామ‌ని ప్ర‌స్తుతం డేటింగ్ లో ఉన్నామ‌ని పేర్కొన్నారు. నెటిజ‌న్లు, అభిమానులు కంగ్రాట్స్ అంటూ గ్రీటింగ్స్ అంటూ హోరెత్తిస్తున్నారు. దీంతో సుస్మితాసేన్(Sushmita Sen) క్లారిటీ ఇచ్చింది.

తాము ఇద్ద‌రం పెళ్లి చేసుకోలేద‌ని కానీ ప్రేమ‌లో మాత్రం పీక‌ల లోతు కూరుకు పోయామ‌ని స్ప‌ష్టం చేసింది ఈ న‌టి. మొత్తంగా లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ బావుందంటున్నారు ప్రేమికులు.

Also Read : ప‌లువురితో డేటింగ్ సుస్మితా సేన్ స్పెష‌ల్

Leave A Reply

Your Email Id will not be published!