Uddhav Thackeray : దమ్ముంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం
మరాఠా యోధుడికి వారుసులెవరో
Uddhav Thackeray : ఎవరు అసలైన మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే వారసులెవరో ప్రజా క్షేత్రంలో కి దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) . శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నా సర్కార్ పోయింది. నా సీఎం పదవి పోయింది. నేను బాధ పడటం లేదు. కానీ నా అనుకున్న వాళ్లు స్వంత వారే నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు.
అదే తనను బాధ పెట్టేలా చేసిందన్నారు ఉద్దవ్ ఠాక్రే. నేను అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అప్రజాస్వామికంగా ఏర్పడిన ఈ సర్కార్ త్వరలోనే కూలి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు ఠాక్రే. తన తండ్రి బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీ పై తన నియంత్రణను కోల్పోతానని బెదిరిస్తున్న వారందరికీ ఒకటే చెపుతున్నా నిజమైన మరాఠా యోధులు ఎవరూ మిమ్మల్ని చూసి భయపడరని స్పష్టం చేశారు.
కోర్టులలో, వీధుల్లో జరిగే యుద్దంలో శివసేన గెలుస్తుందని చెప్పారు. వాళ్లు నాకు ద్రోహం తలపెట్టారు. వారు తమ స్వంత తండ్రి చిత్రాలను ఉపయోగించి ఓట్లు అడగాలని అన్నారు.
మా తండ్రి బాలా సాహెబ్ ఠాక్రే ఫోటోలను ఉపయోగించి ఓట్లు అడుక్కోవడం మానేయాలంటూ సవాల్ విసిరారు.
కొందరు నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నారని కానీ రెబల్స్ మాత్రం తాను అనారోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్ధవ్ ఠాక్రే.
Also Read : మొసళ్లు..బెంగాల్ టైగర్ రెడీగా ఉంది – దీదీ