PM Asked 5 Years Old Child : చిన్నారి జవాబుకి ప్రధాని మోదీ ఫిదా
నేను ఏమి చేస్తానో నీకు తెలుసా ..?
PM Asked 5 Years Old Child : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ గా పేరొందారు ప్రధాని.
ఆయనకు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అన్ని వర్గాలకు చెందిన వారే కాకుండా చిన్నారులకు మోదీ అంటే పిచ్చ అభిమానం.
తాజాగా బుధవారం అరుదైన సన్నివేశానికి వేదికైంది ప్రధాని కార్యాలయం. ఐదేళ్ల వయస్సు కలిగిన ఓ చిన్నారి నరేంద్ర మోదిని(PM Asked 5 Years Old Child) కలుసు కోవడం హాట్ టాపిక్ గా మారింది.
తనను కలిసిన మధ్య ప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ అనిల్ ఫిరోజియా తన కుటుంబాన్ని ప్రధాన మంత్రితో కలిసేందుకు తీసుకు వచ్చారు.
తన కూతురు అహానా ఫిరోజియాకు పీఎం అంటే వల్ల మాలిన అభిమానం. ఈ విషయాన్ని పీఎంకు ముందే తెలియ చేశారు. తనను తన కూతురు కలవాలని అనుకుంటోందని చెప్పడంతో ఇందుకు సమ్మతించారు నరేంద్ర మోదీ.
ఈ సందర్భంగా అహానాను మోదీ కుశల ప్రశ్నలు వేశారు. పాపా ..అహానా నేను నీకు ఎవరో తెలుసా అని అడిగారు. అందుకు చిన్నారి ఠక్కున సమాధానం ఇచ్చింది ప్రధాన మంత్రికి. ఎలాంటి భయం జంకు లేకుండా.
అహానా ఫిరోజియాకు 5 ఏళ్లు. అంకుల్ మీరు ప్రతి రోజూ టీవీలో కనిపిస్తారుగా అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ప్రధాన మంత్రి చిన్నారి ఇచ్చిన ఆన్సర్ విని సంతోషంగా నవ్వారు.
భుజం తట్టి అభినందించారు. ఈ సందర్భంగా అహానా కు ప్రధాన మంత్రి చాక్లెట్ ఇచ్చారు బహుమతిగా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ గా మారింది.
Also Read : కర్ణాటక ప్రభుత్వ వార్షికోత్సవ వేడుకలు రద్దు