Telangana Comment : ఆరోప‌ణ‌లు స‌రే అరెస్ట్ లు ఎప్పుడు

కాకా రేపుతున్న బీజేపీ కామెంట్స్

Telangana Comment : కాళేశ్వ‌రంలో లెక్క‌లేనంత అవినీతి. తెలంగాణ రాష్ట్రం క‌ల్వకుంట్ల కుటుంబానికి దాసోహమైంద‌ని, ఇక అరెస్ట్ లు చేయ‌డ‌మే మిగిలి ఉంద‌ని బాకాలు ఊదుతూ వ‌స్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ.

కేంద్రంలో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ అన్న‌ట్టుగా త‌యారైంద‌ని మ‌రో వైపు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిన్న‌టి దాకా మైం హోం రామేశ్వ‌ర్ రావుపై విమ‌ర్శ‌లు గుప్పించిన బీజేపీ ఎందుక‌నో మౌనం వ‌హించింది.

ఓ వైపు దేశంలోని ప్ర‌త్య‌ర్థుల‌పై కేంద్రం త‌న ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దాడుల‌కు ఉసి గొల్పుతోంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చే స‌రిక‌ల్లా మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతోంది త‌ప్పా చేత‌ల్లో చూపించ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

బీజేపీ స్టేట్ చీఫ్ ఏకంగా అవినీతి సొమ్ము క‌క్కిస్తామ‌ని అంటున్నారు. మ‌రి ఎందుకు క‌క్కించ‌డం లేద‌ని తెలంగాణ(Telangana Comment) ప్ర‌జ‌లు కోరుతున్నారు. మ‌రాఠాలో స‌ర్కార్ ను ప‌డ‌దోశారు.

ఆపై ఈడీ ని రంగంలోకి దించారు. కానీ ఎందుకని తెలంగాణ‌పై ప్ర‌యోగించ‌డం లేద‌న్న అనుమానం వ్య‌క్తం అవుతోంది. త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని త‌గిన స‌మ‌యంలో అవి బ‌య‌ట‌కు తీస్తామ‌ని చెబితే జ‌నం న‌మ్మే స్థితిలో లేరు.

ఏలిన వారు ఎందుకు మౌనం వ‌హిస్తున్నారో తెలుసు కోవాల‌ని అనుకుంటున్నారు. ఆరోప‌ణ‌లు స‌రే అరెస్ట్ ల మాటేంటి అని ప్ర‌శ్నిస్తున్నారు బండి ఇప్పుడైనా స‌మాధానం చెబుతారా లేక మౌనంగా ఉంటారా అన్న‌ది తేల్చాల్సింది బీజేపీనే.

ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు నోరు విప్ప‌డం లేద‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రో వైపు కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు కేసీఆర్.

Also Read : పార్థా స‌రే దొర‌క‌ని దొంగ‌లు ఎంద‌రో

Leave A Reply

Your Email Id will not be published!