ICC T20 Rankings : ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో బాబర్ దే హవా
సూర్యకుమార్ కు సెకండ్ ప్లేస్
ICC T20 Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టి20 ర్యాంకింగ్స్ (ICC T20 Rankings) డిక్లేర్ చేసింది. మరోసారి పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఏకంగా నెంబర్ వన్ గా నిలిచాడు.
ఇక సూర్య కుమార్ యాదవ్ రెండో స్థానంలో నిలిచాడు. విండీస్ టూర్ లో సత్తా చాటాడు. కానీ ఆఖరి మ్యాచ్ లో అతడిని తప్పించింది బీసీసీఐ. దీంతో ర్యాంకును కోల్పోవాల్సి వచ్చింది.
ఇక బాబర్ ఆజమ్ కు అడ్డు లేకుండా పోయింది. దుమ్ము రేపుతున్నాడు. కంటిన్యూగా తన స్థానాన్ని పదిల పర్చుకుంటూ ఆ దేశానికి గర్వ కారణంగా నిలిచాడు.
బాబర్ ఆజమ్ కు 818 పాయింట్లు వచ్చాయి. ఇక సూర్య కుమార్ కు 805 పాయింట్లు దక్కాయి. తర్వాతి స్థానాలలో రిజ్వాన్ , మార్కరమ్ , మలాన్ ఉన్నారు. రవి బిష్ణోయ్ 44 వ ర్యాంకు సాధించాడు.
హర్షల్ పటేల్ గత ర్యాంకింగ్స్ లో 27వ స్థానంలో ఉంటే ఈసారి ఓ ర్యాంకు పడి పోయాడు. బౌలర్ల విషయానికొస్తే ఆసిస్ స్టార్ బౌలర్ హాజిల్ వుడ్ అగ్ర స్థానంలో ఉన్నాడు.
బ్యాటర్లలో మలాన్ తర్వాత ఆసిస్ కు చెందిన ఆరోన్ పింఛ్ ఆరో ప్లేస్ లో ఉన్నాడు. 716 పాయింట్లు పొందాడు. ఇక 661 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు శ్రీలంకకు చెందిన పాథుమ్ నిశాంక.
ఎనిమిదో స్థానంలో 655 పాయింట్లతో కీవీస్ బ్యాటర్ కాన్వే ఉన్నాడు. విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ 644 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఇక పదవ ప్లేస్ లో స్టార్ హిట్టర్ గా పేరొందిన కీవీస్ బ్యాటర్ మార్టిన్ గఫ్టిల్ ఉన్నాడు.
Also Read : గంగూలీ ట్వీట్ కలకలం సర్వత్రా ఆగ్రహం