Scott Styris : హార్దిక్ పాండ్యాపై స్కాట్ స్టైరిస్ కామెంట్స్

భ‌విష్య‌త్తులో భార‌త్ కు అత‌డే కెప్టెన్

Scott Styris : స్కాట్ స్టైరిస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు హార్దిక్ పాండ్యాపై. ఆరు నెల‌ల కింద‌ట పాండ్యా గురించి ఎవ‌రూ అంత‌గా ప‌ట్టించు కోలేదు.

కానీ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 లో అనుకోకుండా హార్దిక్ పాండ్యాకు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ద‌క్కింది. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆ జ‌ట్టుకు తొలిసారిగా ఐపీఎల్(IPL) క‌ప్ అందించాడు.

కొంత కాలంగా జ‌ట్టులో స్థానం కోల్పోయిన పాండ్యాకు ఊహించ‌ని రీతిలో బీసీసీఐ అవ‌కాశం ఇచ్చేలా, త‌న‌ను త‌ప్ప‌నిస‌రిగా ఎంపిక చేసేలా మార్చుకున్నాడు. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

ఆపై రోహిత్ శ‌ర్మ గాయం కార‌ణంగా ఐర్లాండ్ టూర్ కు కెప్టెన్ గా ఎంపిక‌య్యాడు. మ‌రో వైపు విండీస్ టూర్ లో భాగంగా ఆఖ‌రి వ‌న్డేకు నాయ‌క‌త్వం వ‌హించాడు.

దీంతో గ‌త కొంత కాలంగా మార్పులు చేర్పులు చేస్తూ వ‌స్తున్న బీసీసీఐ(BCCI) సెలెక్ష‌న్ క‌మిటీకి కెప్టెన్ రూపంలో పాండ్యా దొరికాడు. మ‌రో వైపు రోహిత్, కేఎల్ రాహుల్ , జస్ ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ను ప‌రీక్షించింది.

మ‌రో వైపు లెక్క‌కు మించిన ఆట‌గాళ్ల‌తో నిండి పోయింది భార‌త జ‌ట్టు. ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది ప్ర‌తిసారి సెలెక్ష‌న్ క‌మిటీ. విచిత్రం ఏమిటంటే ఆడే వాళ్ల‌ను కాకుండా ఆడ‌ని వాళ్ల‌ను ఎంపిక చేశార‌న్న అప‌వాదు మూట గ‌ట్టుకుంది.

ప్ర‌త్యేకించి సంజూ శాంస‌న్ ప్ర‌తిసారి చాన్స్ మిస్ కావ‌డం ప‌లు అనుమానాల‌కు, విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ త‌రుణంలో పాండ్యాపై స్టైరిస్ కీల‌క కామెంట్స్ చేశాడు స్కాట్ స్టైరిస్(Scott Styris) . పాండ్యా భ‌విష్య‌త్తులో భార‌త జ‌ట్టుకు కెప్టెన్ అవుతాడ‌ని జోష్యం చెప్పాడు.

Also Read : ఐపీఎల్ విమ‌ర్శ‌కుల‌పై స‌న్నీ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!