Kevin O’brien : స్టార్ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ గుడ్ బై
ఐర్లాండ్ సెలక్టర్ల వల్లేనని షాకింగ్ కామెంట్స్
Kevin O’brien : ఐర్లాండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ విస్తు పోయేలా చేశాడు ఈ క్రికెటర్.
మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ గా పేరొందాడు ఐర్లాండ్ క్రికెట్ లో. తాను ఇక ఆడలేనంటూ తెలిపాడు. ఆపై తాను ఇలా పదవీ విరమణ ప్రకటించేందుకు ప్రధాన కారణం ఐర్లాండ్ బోర్డు సెలెక్టర్లేనంటూ బాంబు పేల్చాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నా. కానీ సెలెక్టర్ల నిర్వాకం, వివక్ష కారణంగా తప్పుకోవడమే మేలని భావించానని ఆవేదన వ్యక్తం చేశాడు.
గత కొన్ని రోజులుగా తనను పక్కన పెట్టడం తీవ్ర బాధకు గురి చేసిందన్నాడు. అందుకే తాను తట్టుకోలేక రిటైర్మెంట్ ప్రకటన చేయాల్సి వచ్చిందని వెల్లడించాడు కెవిన్ ఒబ్రెయిన్.
ఇందులో భాగంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పదవీ విరమణ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా కెవిన్ ఒబ్రెయిన్ చేసిన ఈ ప్రకటన క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది.
ప్రధానంగా ఐర్లాండ్ క్రికెట్ బోర్డులో ఏం జరుగుతోందనే దానిపై చర్చకు దారి తీసింది. ఈ సందర్బంగా సుదీర్ఘ లేఖలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కెవిన్ ఒబ్రెయిన్(Kevin O’brien).
ఈ జర్నీలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. కోచ్ లు , సిబ్బంది, సహచర ఆటగాళ్లకు థ్యాంక్స్ చెప్పాడు. ప్రత్యేకించి నాతో వెన్నంటి ఉంటూ తనకు మనో ధైర్యాన్ని ఇచ్చిన కుటుంబ సభ్యులకు రుణపడి ఉన్నానని తెలిపాడు.
Also Read : అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్యపై వేటు