Sanju Samson : అమ్మ చేతి వంట అంటే చచ్చేంత ఇష్టం
నా భార్య వచ్చాక నాలో మార్పు వచ్చింది
Sanju Samson : సంజూ శాంసన్ మోస్ట్ పాపులర్ యంగ్ క్రికెటర్ గా పేరొందాడు. కేరళకు చెందిన ఈ క్రికెటర్ వయస్సు 27 ఏళ్లు. ప్రస్తుతం భారత జట్టు ఎంపిక చేసిన జింబాబ్వే టూర్ లో ఉన్నాడు.
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా బీసీసీఐ సరదాగా ర్యాపిడ్ ఫైర్ చేపట్టింది. దీనికి కూల్ గా మనోడు ఆన్సర్స్ ఇచ్చాడు.
ప్రస్తుతం జట్టుకు వికెట్ కీపర్ గా సేవలు అందిస్తున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక వరల్డ్ కప్ లో ఉంటాడా ఉండడా అన్న ఉత్కంఠలో అతడి ఫ్యాన్స్ ఉన్నాడు.
ఇదిలా ఉండగా తనకు అమ్మ చేసిన చేతి వంట అంటే చచ్చేంత ఇష్టం అని చెప్పారు. ఆపై భార్య వచ్చాక తనలో చాలా మార్పులు వచ్చాయని ఒప్పుకున్నాడు.
ఏది ఏమైనా కూల్ గా ఉండడం అలవాటు చేసుకున్నానని దాని వల్ల చాలా నేర్చు కోగలుగుతున్నానని చెప్పారు. తన ఫెవరేట్ క్రికెటర్ ధోనీ అని చెప్పాడు.
చాక్లెట్లంటే చాలా ఇష్టమన్నాడు సంజూ శాంసన్(Sanju Samson). తనకు కూడా ఓ ముద్దు పేరుందన్నాడు. బప్పు అని సరదాగా పిలుస్తారని చెప్పాడు. కేరళలోని ప్రదేశాలంటే అభిమానం.
ఏ మాత్రం చాన్స్ చిక్కితే టూర్ చేయాలని ఉంటుందన్నాడు. ఇన్ స్టా లో యుజ్వేంద్ర చాహల్ పోస్ట్ చేసే కంటెంట్ అంటే ఇష్టమన్నాడు సంజూ శాంసన్.
ఏ మాత్రం ఖాళీ దొరికితే నేను, నా భార్య కలిసి శిఖర్ భాయ్ రీల్స్ చూస్తామని తెలిపాడు. ప్రస్తుతం ఈ స్టార్ హిట్టర్ ర్యాపిడ్ ఫైర్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : సచిన్ పై కాంబ్లీ షాకింగ్ కామెంట్స్
His favourite sporting personality? 🤔
Food that he loves but cannot eat now? 🍲
His one nickname that not many are aware of? 😎
All this & much more in this fun rapid-fire with @IamSanjuSamson, straight from Harare. 👌 👌 – By @ameyatilak #TeamIndia | #ZIMvIND pic.twitter.com/IeidffhtMl
— BCCI (@BCCI) August 17, 2022