Bilkis Bano : నేనింకా షాక్ లోనే ఉన్నా – బిల్కిస్ బానో

గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలి ఆవేద‌న

Bilkis Bano : గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డి, ఏకంగా కుటుంబాన్ని దారుణ హ‌త్య‌కు గురి చేసిన దోషుల‌ను విడుద‌ల చేయ‌డంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.

ఈ ఘ‌ట‌న‌పై అత్యాచారానికి లోనైన బాధితురాలి బిల్కిస్ బానో(Bilkis Bano), ఆమె భ‌ర్త ఇంకా షాక్ నుంచి కోరుకోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు న్యాయం బ‌తికే ఉంద‌న్న న‌మ్మ‌కం ఉండేద‌ని కానీ దోషులు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆ విశ్వాసం కూడా స‌న్న‌గిల్లింద‌ని వాపోయింది.

ప్ర‌తి క్ష‌ణం భ‌య‌ప‌డుతూ బ‌త‌కాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఇదిలా ఉండగా 21 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన బిల్కిస్ బానో త‌ను సామూహిక అత్యాచారానికి గురైంది.

అంతే కాదు త‌న కుటుంబానికి చెందిన ఏడుగురిని క‌ళ్ల ముందే హ‌త్య చేయ‌డాన్ని చూసింది. వారిలో ఆమెకు చెందిన ప‌సిపాప కూడా ఉంది.

రేప్ కు గురైన స‌మ‌యంలో బిల్కిస్ బానో 5 నెల‌ల గ‌ర్భిణీగా ఉంది. 2002 గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డిన 11 మంది దోషులు ఇటీవ‌లే విడుద‌లయ్యారు.

ఆపై వారు స్వేచ్ఛ‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే స్వీట్లు కూడా పంచుకున్నారు. ఆ ఫోటోలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించాయి. వారు విడుద‌ల‌య్యార‌ని తెలిసిన వెంట‌నే నేను షాక్ కు గుర‌య్యానని వాపోయింది బిల్కిస్ బానో.

నేను అత్యున్న‌త న్యాయ స్థానాల‌ను విశ్వ‌సించాను. నాకు జ‌రిగిన గాయంతోనే నేను జీవించ‌డం నేర్చుకున్నాన‌ని చెప్పింది. ఆగ‌స్టు 15న గుజ‌రాత్ ప్ర‌భుత్వం త‌న రిమిష‌న్ పాల‌సీ ప్ర‌కారం దోషుల విడుద‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది. గోద్రా స‌బ్ జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

Also Read : ప‌ర్మిష‌న్ కావాలంటే ఎన్ఐఏ ఇవ్వాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!