Shadab Khan : మాతో ఆడటం కోహ్లీకి అగ్నిపరీక్ష
పాకిస్తాన్ క్రికెటర్ షాదాబాద్ ఖాన్
Shadab Khan : యూఏఈ వేదికగా మెగా టోర్నీ ప్రారంభమైంది. వచ్చే సెప్టెంబర్ 17 వరకు కొనసాగనుంది. ఇక దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన పోరు ఆగస్టు 28 ఆదివారం జరగనుంది.
కోట్లాది కళ్లన్నీ యావత్ ఈ మ్యాచ్ పై ఫోకస్ పెట్టాయి. తాజా, మాజీ ఆటగాళ్లు తమకు తోచిన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు భారత జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్ జట్టుతో ఓడి పోవడం తనను తీవ్రంగా బాధకు గురి చేసిందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టు క్రికెటర్ షాదాబ్ ఖాన్(Shadab Khan) షాకింగ్ కామెంట్స్ చేశాడు. తమతో ఆడే ఏ మ్యాచ్ అయినప్పటికీ విరాట్ కోహ్లీకి అగ్ని పరీక్ష లాంటిదని పేర్కొన్నాడు.
2021లో జరిగిన టీ20 టోర్నీలో పాకిస్తాన్ తో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ పరుగుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకానొక దశలో ఆసియా కప్ లో ఎంపికవుతాడా లేదా అన్న అనుమానం వ్యక్తమైంది.
చివరకు ఎంపిక కావడంతో ఫుల్ ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుండి 22 ఇన్నింగ్స్ లలో మాజీ కెప్టెన్ కోహ్లీ(Virat Kohli) ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఇంగ్లండ్ టూర్ లో అన్ని ఫార్మాట్ లలో తన ఆరు ఇన్నింగ్స్ లలో 20 పరుగుల మార్క్ ను దాటలేక పోయాడు. అనంతరం విండీస్, జింబాబ్వే టూర్లకు రెస్ట్ తీసుకున్నాడు.
మాతో కోహ్లీ పరుగులు చేయక పోయినా ఇతర జట్లతో నైనా బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు షాదాబ్ ఖాన్.
Also Read : పాకిస్తాన్ తో ఓటమి బాధించింది – కేఎల్
Shadab Khan in @imVkohli the legend and why critics should not be talking who’s form. #Kohli # ViratKohli pic.twitter.com/4J4g39renM
— Vimal कुमार (@Vimalwa) August 26, 2022