CM KCR : దోపిడీ దొంగ‌ల ప‌ట్ల జ‌ర జాగ్ర‌త్త – కేసీఆర్

పీఎం న‌రేంద్ర మోదీకి మీట‌ర్లు పెట్టాలె

CM KCR : సీఎం కేసీఆర్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు. దేశానికే త‌ల‌మానికంగా నిలిచిన తెలంగాణ‌పై ఇప్పుడు బీజేపీ వాళ్ల క‌న్ను ప‌డింద‌న్నారు.

దోపిడీ దొంగ‌లు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ల‌కు దోచి పెట్టేందుకే మోదీ పీఎంగా ఉన్నార‌ని 133 కోట్ల ప్ర‌జ‌ల కోసం కాద‌న్నారు. సోమ‌వారం పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్ట‌రేట్ ను ప్రారంభించారు.

అనంత‌రం జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. చెప్పులు మోసేటోళ్లు బీజేపీ నాయ‌కులు కావ‌డం దారుణ‌మ‌న్నారు. తెలంగాణ ఆత్మ గౌర‌వాన్ని మోదీ, అమిత్ షా, గుజరాతీల వ‌ద్ద తాక‌ట్టు పెట్ట‌డం సిగ్గు చేట‌న్నారు సీఎం.

కులం, మ‌తం పేరుతో చిచ్చు పెట్టే వాళ్ల నుంచి జ‌ర జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు కేసీఆర్(CM KCR) . దొంగ‌ల బూట్లు మోసే స‌న్నాసులు ఇక్క‌డ ఉండ‌డం దారుణ‌మ‌న్నారు.

ఆయ‌న ప‌రోక్షంగా బండి సంజ‌య్ ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మ గౌర‌వాన్ని ఢిల్లీలో తాక‌ట్టు పెడుదామా లేక స్వ‌యం ప్ర‌తిపత్తితో స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డ‌దామా మీరే చెప్పాల‌ని ప్ర‌శ్నించారు సీఎం.

కూల గొట్ట‌డం చాలా తేలిక అని కానీ క‌ట్ట‌డ‌మే చాలా క‌ష్ట‌మ‌న్నారు. మోస‌పోతే గోస ప‌డుతాం. ఒక్క‌సారి దెబ్బ‌తింటే ఇక కోలుకోవ‌డం త‌ల‌కు మించిన భారంగా మారుతుంద‌న్నారు కేసీఆర్.

దేశంలో ప‌రిపాల‌న చేత‌కాక మోదీ చేతులెత్తేశాడ‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టికే గంప‌గుత్త‌గా ప్ర‌భుత్వ ఆస్తులు, సంస్థ‌ల‌ను కార్పొరేట్ల‌కు అప్ప‌గించే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని ఆరోపించారు సీఎం.

తాను స‌త్యం మాట్లాడుతున్నందుకే ఇప్పుడు వ‌ర్షం చినుకులు వ‌స్తున్నాయంటూ సెటైర్ వేశారు.

Also Read : ఐకియా నిర్వాకం కేటీఆర్ ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!