Yash Sonkiya : దృష్టి లోపం..రూ. 47 లక్షల ప్యాకేజీ సొంతం
స్టాఫ్ వేర్ ఇంజనీర్ సోనాకియా సంచలనం
Yash Sonkiya : తలుచుకుంటే ఏమైనా చేయగలనని , వైకల్యం , దృష్టి లోపం ఏ మాత్రం విజయానికి అడ్డంకి కాదని నిరూపించాడు. టెక్నాలజీ మాయలో
పడి నేటి యువత తమ విలువైన కాలాన్ని బుగ్గి పాలు చేసుకుంటే ఈ కళ్లు కనిపించని యువకుడు మాత్రం వాటిని అన్నింటిని అధిగమించాడు.
యావత్ టెక్కీ ప్రపంచం విస్తు పోయేలా ఏకంగా భారీ ప్యాకేజీని సాధించాడు. ఈ దేశం అతడిని చూసి గర్విస్తోంది. ఇలాంటి వాళ్లే భారత మాతకు కావాల్సింది.
ఇంతకూ ఎవరీ యువకుడు. అతడు సాధించిన ఘనత ఏమిటి. అంత పెద్ద ఎత్తున ప్యాకేజీ అందుకునేందుకు పడిన కష్టాలు ఏంటి. ఎలా వాటన్నింటిని తట్టుకుని దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో జాబ్ సాధించ గలిగాడనేది తెలుసుకుంటే ఆశ్చర్యం వేయక మానదు.
అతడు ఎవరో కాదు మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన యష్ సోనాకియా(Yash Sonkiya). ఇతడికి దృష్టి లోపం (చూపు కనిపించదు) ఉంది. ప్రపంచాన్ని చూడలేడు.
కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తనను తాను మల్చుకున్నాడు. ఏకంగా మేటి ఐటీ దిగ్గజ కంపెనీగా పేరొందిన సత్య నాదెళ్ల సిఇఓగా ఉన్న మైక్రో సాఫ్ట్ లో జాబ్ సంపాదంచాడు.
మొత్తం అతడికి అందిన ఆఫర్ ప్యాకేజీ తెలిస్తే విస్తు పోతాం. ఏకంగా రూ. 47 లక్షలు. ఈ ఆఫర్ ను తాను స్వకరించానని ఈ సందర్భంగా చెప్పాడు యష్ సోనాకియా(Yash Sonkiya).
మొదట్లో ఇంటి నుండి పని చేయమని కోరారని, కానీ త్వరలో తాను కంపెనీకి చెందిన బెంగళూరు కార్యాలయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేరుతానని స్పష్టం చేశాడు.
యష్ సోనాకియా 2021లో బీటెక్ డిగ్రీని ఇండోర్ కు చెందిన శ్రీ గోవింద్రం సెక్సారియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి పొందారు.
సోనాకియా ఎనిమిదేళ్ల వయస్సులో గ్లాకోమాతో కంటి చూపును కోల్పోయాడు. స్క్రీన్ రీడర్ సాఫ్ట్ వేర్ సాయంతో చదువును పూర్తి చేశాడు. కోడింగ్ నేర్చుకున్నాడు.
మైక్రో సాఫ్ట్ లో దరఖాస్తు చేశాడు. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వూలో మెప్పించాడు. అయితే యష్ సోనాకియా తండ్రి యశ్ పాల్ నగరంలో క్యాంటీన్ నడుపుతున్నాడు.
నేను కలలు కన్నాను. నా పెద్ద కొడుకు ఏదో ఒక రోజు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుతాడని నమ్మకం ఉంది. ఇవాళ సాధించాడని తండ్రి చెప్పాడు. నేటి
యువత యష్ సోనాకియాను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
Also Read : ఈద్గా గ్రౌండ్ లో గణేష్ ఉత్సవాలకు ఓకే
