Nirvair Singh : రోడ్డు ప్ర‌మాదంలో పంజాబీ సింగ‌ర్ మృతి

నిర్వైర్ సింగ్ మృతితో తీర‌ని విషాదం

Nirvair Singh : ఆస్ట్రేలియాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో పంజాబీ సింగ‌ర్ నిర్వేర్ సింగ్(Nirvair Singh) మృతి చెందాడు. అదుపు త‌ప్పి కియా కారును న‌డుపుతున్న 23 ఏళ్ల యువ‌కుడిపై నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేశాడ‌ని అభియోగాలు మోపారు.

నిర్వైర్ సింగ్ త‌న గాన వృత్తిని కొన‌సాగించేందుకు తొమ్మిది సంవ‌త్స‌రాల కింద‌ట ఆస్ట్రేలియాకు వెళ్లారు. మెల్ బోర్న్ కు స‌మీపంలో కియా సెడాన్ వేగంగా న‌డ‌ప‌డం వ‌ల్ల మూడు వాహ‌నాలు ఢీకొన్నాయి.

ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రి ప‌ట్టుబ‌డ్డార‌ని స‌మాచారం. డిగ్గ‌ర్స్ రెస్ట్ లోని బుల్లా డిగ్గ‌ర్స్ రెస్ట్ రోడ్డులో మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. సెడాన్ కు చెందిన 23 ఏళ్ల డ్రైవ‌ర్ ను అరెస్ట్ చేసి అభియోగాలు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

నిర్వైర్ సింగ్ కు 42 ఏళ్లు. త‌న వృత్తి ప‌ని నిమిత్తం వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అదుపు త‌ప్పిన కియా మ‌రో రెండు వాహ‌నాల‌ను , ఆపై నిర్వైర్ సింగ్ దారిలోకి వ‌చ్చిన జీపును ఢీకొట్ట‌డంతో అత‌డు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడ‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా జీపులో ఉన్న ఓ మ‌హిళ‌కు గాయ‌ప‌డింది. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో కారు అదుపు త‌ప్పడం వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ ఘ‌ట‌న‌కు మితిమీరిన వేగంతో కూడినడ్రైవింగ్ కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. లైసెన్స్ లేని డ్రైవింగ్ వంటి అభియోగాల‌ను ఎదుర్కొంటున్నాడు. మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజ‌రు ప‌ర్చ‌నున్నారు.

నిర్వైర్ సింగ్(Nirvair Singh) ఆక‌స్మిక మృతితో తీవ్ర విషాదం నెల‌కొంది. మై ట‌ర్న్ ఆల్బ‌మ్ లోని తేరా బినా పాట‌తో మిస్ట‌ర్ సింగ్ కీర్తి పొందారు.

Also Read : 2.7 కోట్ల పోస్ట్ లు తొల‌గింపు – మెటా

Leave A Reply

Your Email Id will not be published!