Pujitha Ponnada : రాక్ స్టార్ తో పెళ్లి అబద్దం – పూజిత
అవన్నీ పుకార్లే వాస్తవాలు కాదు
Pujitha Ponnada : సినీ ఇండస్ట్రీ అంటేనే కట్టు కథలకు, పుకార్లకు, ఊహాగానాలకు పెట్టింది పేరు. ఇక బాలీవుడ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ జాడ్యం టాలీవుడ్, కోలీవుడ్ కు సోకింది.
తాజాగా ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటి అంటే ప్రముఖ రచయిత సత్యానంద్ కొడుకు అయిన సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్(Devi sri prasad) పెళ్లి చేసుకున్నాడని. అది రహస్యంగా తెలుగుంటి అమ్మాయి అయిన నటిగా పేరొందిన పూజిత పొన్నాడతోనని. ఆనోటా ఈ నోటా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హీరోయిన్ నోరు విప్పింది. పూజిత పొన్నాడ(Pujitha Ponnada) సీరియస్ గా స్పందించింది. ఎవరు ఇలా రాస్తున్నారో, ఎందుకు ప్రచారం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పింది.
తాము ఎక్కడా కలుసు కోలేదని, తాను రిలేషన్ లో లేనని కుండ బద్దలు కొట్టింది. తనకు సినిమా కెరీర్ ముఖ్యమని తెలిపింది. పూర్తిగా పెళ్లిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
సోషల్ మీడియా పేరుతో అవాకులు, చెవాకులు ఇలా రాసేసుకుంటూ పోతే ఎలా అని నిలదీసింది. ఇప్పటికే చాలా సార్లు చెప్పా. కానీ బయటకు చెప్పక పోతే అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. అంతకన్నా సంబంధం లేదంది పూజిత పొన్నాడ. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని మాత్రమే తెలుసు. కానీ ఇప్పటి దాకా మేమసలు మాట్లాడుకోక పోతే పెళ్లి ఎలా అవుతుందో మీరే చెప్పండి అంటూ నిలదీసింది.
Also Read : మరణాంతరం చాడ్విక్ కు పురస్కారం