Shatrughan Sinha : క‌మ‌ల్ ఆర్ ఖాన్ కు సిన్హా మ‌ద్ద‌తు

అత‌ను కుట్ర‌కు బ‌ల‌య్యాడు

Shatrughan Sinha :  న‌టుడు శ‌త్రుఘ్న సిన్హా షాకింగ్ కామెంట్స్ చేశాడు. న‌టుడు, క్రిటిక్ గా పేరొందిన క‌మ‌ల్ ఆర్ ఖాన్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కుట్ర‌కు బ‌లైన‌ట్లుగా త‌న‌కు అనిపిస్తోందంటూ పేర్కొన్నాడు.

అత‌డికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. గ‌త వారం ముంబైలో క‌మ‌ల్ ఆర్ ఖాన్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న‌టుడిగా, నిర్మాత‌గా, విమ‌ర్శ‌కుడిగా పేరొందారు కేఆర్కే.

ఇదిలా ఉండ‌గా రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన న‌టుడు శ‌త్రుఘ్న సిన్హా బేష‌ర‌తుగా మ‌ద్ద‌తుగా నిలిచారు. కేఆర్కేగా ప్ర‌సిద్ధి చెందిన క‌మ‌ల్ ప్ర‌స్తుతం అనేక కేసుల‌తో పోరాడుతున్నారు.

ఈ నెలాఖ‌రు వ‌ర‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు. కుట్ర‌కు బాధితుడిగా పేర్కొన్నారు సిన్హా. గ‌త మంగ‌ళ‌వారం 2020 లో తిరిగి పోస్ట్ చేసిన కొన్ని ట్వీట్ల‌పై ముంబై విమానాశ్ర‌యం నుండి మ‌లాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

న‌టుడు ఎక్క‌డికి వెళ్ల‌కుండా ముంద‌స్తుగా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. కాగా ముంబైకి వ‌చ్చిన వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల క‌స్ట‌డీకి త‌ర‌లించారు.

ఛాతిలో నొప్పి రావ‌డంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 2019 నుండి ఒక కేసులో లైంగిక ప్ర‌యోజ‌నాల‌ను డిమాండ్ చేసినందుకు మ‌రోసారి అరెస్ట్ అయ్యాడు.

ప్ర‌స్తుతం శ‌త్రుఘ్న సిన్హా(Shatrughan Sinha) క‌మ‌ల్ ఆర్ ఖాన్ కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కావాల‌ని ప్ర‌శ్నించే వారిపై కేసులు న‌మోదు చేస్తూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

ప్ర‌స్తుతం కేఆర్కేను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరుతున్నారు.

Also Read : బిగ్ బాస్ అదో అనైతిక షో – నారాయ‌ణ

Leave A Reply

Your Email Id will not be published!