Actress Tabu : ప్రేమించే వాడి కోసం వేచి చూస్తున్నా – టబు
పిల్లల్ని కనాలంటే పెళ్లి అవసరం లేదు
Actress Tabu : ప్రముఖ బహు భాషా నటి టబు షాకింగ్ కామంట్స్ చేసింది. ఇన్నేళ్లయినా తను ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
పిల్లలు కనాలంటే ఎవరితో సహజీవనం చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే పెళ్లి కూడా అక్కర్లేదు. ఈజీగా గర్భం దాల్చొచ్చు. సరోగసి ద్వారా కూడా తల్లి అయ్యే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి.
దాని గురించి తాను ఏమీ ఆలోచించం లేదని పేర్కొంది టబు. విచిత్రం ఏమిటంటే టబుకు ఇప్పుడు 50 ఏళ్లు వచ్చాయి. గతంలో వెంకటేశ్, నాగార్జున సరసన నటించింది.
తాజాగా బన్నీ, పూజా హెగ్డే కలిసి నటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అల వైకుంఠ పురంలో కీలక పాత్ర పోషించింది. రాములో రాములా పాటకు స్టెప్పులు కూడా వేసింది. ప్రస్తుతం ఆమె ఓ జాతీయ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకుంది.
నాకు కూడా తల్లిని అవ్వాలని ఉంది. కానీ పెళ్లితోనే అది జరుగుతుందని తాను అనుకోవడం లేదని పేర్కొంది. ఇదే సమయంలో తనను ప్రేమించి, తన కోసం ఆరాధించే వ్యక్తి కోసం వేచి చూస్తున్నా.
ఇప్పటి వరకు ఎవరూ నాకు తారస పడలేదని చెప్పింది. ఒకవేళ నచ్చిన వ్యక్తి తనకు తారస పడితే వెంటనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది నటి టబు.
ప్రస్తుతం టబు పెళ్లిపై, పిల్లలపై చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు బాలీవుడ్, టాలీవుడ్ ను ఒక్కసారిగా విస్తు పోయేలా చేశాయి. ఏది ఏమైనా టబునా(Actress Tabu) మజాకా అని అభిమానులు అంటున్నారు.
Also Read : కమల్ ఆర్ ఖాన్ కు సిన్హా మద్దతు