Mohammad Amir : ప్రీతి జింటా నా ఆల్ టైమ్ ఫేవ‌రేట్

పాకిస్తాన్ మాజీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్

Mohammad Amir :  పాకిస్తాన్ మాజీ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్(Mohammad Amir)  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా అరుదైన ఫోటోను పంచుకున్నారు. త‌న జీవితంలో ఆల్ టైమ్ ఫేవ‌రేట్ ఎవ‌ర‌ని అడిగితే ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ప్రీతి జింటా అని పేర్కొన్నారు.

ఆమెతో దిగిన చిత్రాన్ని పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కో ఫౌండ‌ర్ గా ఉన్నారు న‌టి ప్రీతి జింటా.

ఇదిలా ఉండ‌గా ఈ పాకిస్తాన్ మాజీ పేస‌ర్ అమీర్ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో జ‌మైకా త‌ల్లావాస్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

గురువారం ఈ 30 ఏళ్ల బాలీవుడ్ న‌టి తో కొద్ది సేపు ముచ్చ‌టించాడు. మైదానం వ‌ద్ద‌కు చేరుకున్న ఆమెతో సంభాషించ‌డం, త‌ను ఆరాధించే, ఆల్ టైమ్ ఫేవ‌రేట్ గా భావించే ప్రీతి జింటా రావ‌డంతో ఆనందానికి లోన‌య్యాడు.

పంజాబ్ కింగ్స్ స‌హ య‌జ‌మాని మాత్ర‌మే కాదు సెయింట్ లూసియా కింగ్స్ కో ఫౌండ‌ర్ కూడా. ప్రీతి జింటా(Preity Zinta) సెయింట్ లూసియా కింగ్స్ కో ఫౌండ‌ర్ గ్రాస్ ఐలెట్ లో జ‌రిగిన త‌ల్లావాస్ , కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన సీపీఎల్ మ్యాచ్ కు హాజ‌ర‌య్యారు.

సెయింట్ లూసియా కింగ్స్ జ‌మైకా త‌ల్లావాస్ పై 164 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మ‌రో బంతి మిగిలి ఉండ‌గానే 2 వికెట్ల తేడాతో ఓడించింది. టార్గెట్ ఛేద‌న‌లో జాన్స‌న్ చార్లెస్ 62 ప‌రుగుల‌తో అత్య‌ధిక స్కోర్ సాధించాడు.

Also Read : ఆసియా క‌ప్ ఫైన‌ల్ కు పాకిస్తాన్

Leave A Reply

Your Email Id will not be published!