BJP Offering : పంజాబ్ లో ఆప‌రేష‌న్ లోట‌స్ – ఆప్

ఎమ్మెల్యేల‌కు బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్

BJP Offering : దేశంలో ఈ మ‌ధ్య ఆప‌రేష‌న్ లోట‌స్ అన్న పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఆప‌రేష‌న్ లోట‌స్ అంటే ఇదేదో సైనిక చ‌ర్య‌నో లేదా ఇత‌ర

దేశాల మీద దాడులో లేక ఉగ్ర‌వాదుల ఏరివేత కోసం పెట్టిన పేరు అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే.

ఎందుకంటే కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్ర‌భుత్వం కొత్త‌గా ఈ పేరుతో ప్లాన్ చేస్తోంద‌ని ప్ర‌తిప‌క్షాలు మండి ప‌డుతున్నాయి. మోదీ ప్ర‌భుత్వం

ఏర్ప‌డిన ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది బీజేపీయేత‌ర రాష్ట్రాల‌లో ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేసింది.

నిన్న మొన్న మ‌రాఠాలో కొలువు తీరిన మ‌హా వికాస్ అఘాడీ స‌ర్కార్ ను శివ‌సేన నాయ‌కుడు ఏక్ నాథ్ షిండేను(Eknath Shinde) అడ్డం పెట్టుకుని అక్క‌డి ప్రభుత్వానికి చెక్ పెట్టింది.

ఇక దేశంలో త‌మ‌కు ఎదురే లేకుండా చేసుకోవాల‌ని తెలివిగా పావులు క‌దుపుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజ‌స్థాన్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాలు ఉండ‌గా ఆప్ కు పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి.

ఇక్క‌డ కూడా ప్ర‌భుత్వాల‌ను కూల్చే ప‌నిలో ప‌డింద‌ని ఆప్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల జార్ఖండ్ లో జేఎంఎం సంకీర్ణ స‌ర్కార్ కు చెక్ పెట్టాల‌ని చూసింది.

కానీ అక్క‌డ జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్(Hemant Soren) ముందు జాగ్ర‌త్త ప‌డ‌డంతో గండం త‌ప్పింది. అసెంబ్లీలో విశ్వాస ప‌రీక్షకు పిలుపు నివ్వ‌డం

బ‌ల నిరూప‌ణ చేసుకోవ‌డంతో కాస్తా వెనక్కి త‌గ్గింది.

ఇక ప‌శ్చిమ బెంగాల్ తో పాటు తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల‌ను కూడా బీజేపీ ఆప‌రేష‌న్ లోట‌స్ పేరుతో ప్ర‌యోగాలు చేస్తోంది.

తాజాగా పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇస్తామ‌ని బీజేపీ ఆఫ‌ర్(BJP Offering) ప్ర‌క‌టించిందంటూ మంత్రి హ‌ర్పాల్ చీమా

సీఎం భ‌గ‌వంత్ మాన్ తో చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. స‌రైన స‌మ‌యంలో నిరూపిస్తామ‌న్నారు చీమా.

Also Read : బీజేపీపై దాడుల‌కు పోలీసుల‌దే బాధ్య‌త

Leave A Reply

Your Email Id will not be published!