T20 World Cup West Indies Squad : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విండీస్ టీమ్

డిక్లేర్ చేసిన విండీస్ క్రికెట్ బోర్డు

T20 World Cup West Indies Squad : ఈ ఏడాది అక్టోబ‌ర్ లో ఆస్ట్రేలియాలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ప‌లు జ‌ట్లు త‌మ ఆట‌గాళ్ల‌ను ప్ర‌క‌టించాయి. ఐసీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఈ మెగా టోర్నీకి ఆయా జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌కు సెప్టెంబ‌ర్ 15 డెడ్ లైన్ విధించింది.

దీంతో ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు త‌న టీమ్ ను డిక్లేర్ చేసింది. గురువారం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే జ‌ట్టును వెల్ల‌డించింది. ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ అక్టోబ‌ర్ నుండి న‌వంబ‌ర్ దాకా కొన‌సాగుతుంది.

16 జ‌ట్ల‌కు పైగా పాల్గొన‌నున్నాయి ఈ మెగా టోర్నీలో. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ పురుషుల టి20 కోసం విండీస్(T20 World Cup West Indies Squad) కీల‌క మార్పులు చేసింది.

15 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది. ఇదిలా ఉండ‌గా 2012లో శ్రీ‌లంక‌లో , 2016లో భార‌త్ లో ఐసీసీ వ‌ర‌ల్డ్ టి20 క‌ప్ గెలుచుకున్న ఏకైక జ‌ట్టు వెస్టిండీస్ కావ‌డం విశేషం.

ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ అక్టోబ‌ర్ 16న ప్రారంభం కానుంది. ఫైన‌ల్స్ న‌వంబ‌ర్ 13న జ‌రుగుతుంది. ఇంకా శ్రీ‌లంక క్రికెట్ బోర్డు ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది. యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ -2022ను శ్రీ‌లంక అనూహ్యంగా ఎగ‌రేసుకు పోయింది.

భార‌త్, పాకిస్తాన్, ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించింది. ఇక ఆ జ‌ట్టునే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఇక వెస్టిండీస్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే నికోల‌స్ పూర‌న్ స్కిప్ప‌ర్ గా ఉన్నాడు.

రోవ్ మ‌న్ పావెల్ , యానిక్ కారియా, జాన్స‌న్ చార్లెస్ , షెల్డ‌న్ కాట్రెల్ , షిమ్రోన్ హిట్ మైర్ , హోల్డ‌ర్ , హుసేన్ , జోసెఫ్ , బ్రాండ‌న్ కింగ్ , ఎవిన్ లూయిస్ , కైల్ మేయ‌ర్స్ , మెక్ కాయ్ , రేమాన్ రీఫ‌ర్త్ ఉన్నారు.

Also Read : నిమిషాల్లో భార‌త్ పాక్ టికెట్లు క్లోజ్

Leave A Reply

Your Email Id will not be published!