Brahmastra Karan Johar : రూ. 300 కోట్లు దాటిన బ్ర‌హ్మాస్త్ర చిత్రం

ఫుల్ జోష్ లో ర‌ణ్ బీర్ , ఆలియా భ‌ట్

Brahmastra Karan Johar : తీవ్ర ఒడిదుడుకుల మ‌ధ్య ఇటీవ‌ల విడుద‌లైన సినిమాలు ఆశించిన మేర ఆడ‌లేదు. మ‌రో వైపు సౌత్ ఇండియాకు చెందిన మూవీస్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగించాయి.

ఈ త‌రుణంలో బాలీవుడ్ నుంచి విడుద‌లైన బ్ర‌హ్మాస్త్ర చిత్రం బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వ‌సూలు చేసింది.

ఇంకా చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో మూవీలో న‌టించిన ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్ లు ఆనందానికి లోన‌వుతున్నారు. భార‌త దేశంలో రూ. 200 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను దాటేసింది. చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డం, భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డంతో జోష్ లో మునిగి పోయారు. 

ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియా , ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ. మొద‌టి వారంలోనే ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్లు రావ‌డం విస్తు పోయేలా చేసింది బాలీవుడ్ ను. అన్ని భాష‌ల్లో క‌లిపి ఇండియాలో రూ. 173 కోట్ల నిక‌ర లాభాన్ని ఆర్జించింది. విడుద‌లైన అన్ని చోట్లా బ్ర‌హ్మాస్త్ర‌కు మంచి టాక్ ల‌భించింది.

ఇక చిత్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్(Brahmastra Karan Johar) శుక్ర‌వారం ట్విట్ట‌ర్ లో చిత్రానికి సంబంధించి వారంలో వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను పంచుకున్నారు.

మొద‌టి వారం పూర్త‌య్యే స‌రికి రూ. 300 కోట్ల మార్క్ ను దాటం. ప్ర‌స్తుతం రెండో వారంలోకి అడుగు పెట్టాం. మ‌రింత‌గా ఆద‌రిస్తార‌ని త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్నారు క‌ర‌ణ్ జోహార్.

వ‌ర‌ల్డ్ వైడ్ గా అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన చిత్రంగా త‌మ మూవీ నిలిచింద‌న్నారు నిర్మాత‌.

Also Read : ఏ మాయ చేసావే మూవీ సీక్వెల్

Leave A Reply

Your Email Id will not be published!