Ramiz Raja : అది పూర్తిగా రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న – ర‌మీజ్ ర‌జా

భార‌తీయ జ‌ర్న‌లిస్ట్ మ‌రోసారి కామెంట్స్

Ramiz Raja : యూఈఏ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో పాకిస్తాన్ ఓట‌మి త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు పీసీబీ చైర్మ‌న్ ర‌మీజ్ రజాను ఇంకా వెంటాడుతున్నాయి.

ఆయ‌న భార‌తీయ జ‌ర్న‌లిస్ట్ పై నోరు పారేసుకోవ‌డాన్ని క్రీడా లోకం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఒక అత్యున్న‌త‌మైన ప‌ద‌విలో కొన‌సాగుతున్న ఒక‌ప్ప‌టి మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ ప్ర‌స్తుత పీసీబీ చైర్మ‌న్ గా ఉన్న ర‌మీజ్ ర‌జా(Ramiz Raja) కు త‌గ‌ద‌ని తాజా, మాజీ క్రికెట‌ర్లు సైతం హిత‌వు ప‌లికారు.

పాకిస్తాన్ శ్రీ‌లంక చేతిలో ఓట‌మి పాలైంది. ఈ సంద‌ర్భంగా పాకిస్తాన్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ర‌మీజ్ ర‌జాను మీడియా చుట్టు ముట్టింది.

మీరేమైనా చెప్పాల‌ని అనుకుంటున్నారా అని. అదేం లేదు మావాళ్లు బాగా ఆడారంటూ కితాబు ఇచ్చారు. ప‌నిలో ప‌నిగా అక్క‌డే ఉన్న ఇండియ‌న్ జ‌ర్న‌లిస్ట్ తీవ్ర నిరాశ‌తో కూరుకు పోయిన పాక్ అభిమానుల‌కు మీరేం సందేశం ఇస్తారంటూ ప్ర‌శ్నించాడు.

దీంతో స‌హ‌నం కోల్పోయిన ర‌మీజ్ ర‌జా నువ్వు ఇండియ‌న్ జ‌ర్న‌లిస్ట్ వి క‌దూ ..నీకు నేనెందుకు స‌మాధానం చెప్పాల‌న్నాడు. ఆపై మీకు మ‌రింత ఆనందంగా ఉంద‌ని అనుకుంటున్నానంటూ ఎద్దేవా చేశాడు.

దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తమైంది. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కు గుర‌య్యాడు ర‌మీజ్ ర‌జా(Ramiz Raja). ఇవాళ దీనిపై అడిగిన ప్ర‌శ్న‌కు మ‌రోసారి స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

అదంతా కావాల‌ని రెచ్చ‌గొట్టేలా ప్ర‌శ్నించాడంటూ స్ప‌ష్టం చేశాడు పీసీబీ చైర్మ‌న్. విచిత్రం ఏమిటంటే ఫోన్ కూడా లాక్కునే ప్ర‌య‌త్నం చేశారు ర‌మీజ్ రజా.

Also Read : సూప‌ర్ స‌బ్ రూల్ గేమ్ ఛేంజ‌ర్ – ర‌వి శాస్త్రి

Leave A Reply

Your Email Id will not be published!