Ranbir Kapoor : అలియా భట్ పై అసూయతోనే విమర్శలు
రణబీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్
Ranbir Kapoor : బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్(Alia Bhat) ప్రెగ్నెన్సీపై కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. లేనిపోని కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు భర్త, సహ నటుడైన రణబీర్ కపూర్.
కేవలం అసూయతోనే ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారంటూ స్పష్టం చేశారు. ఆయన జాతీయ మీడియాతో ఆదివారం మాట్లాడారు.
ఆమె గర్భం ధరించడాన్ని తప్పు పట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు రణ్ బీర్ కపూర్. విషయం స్పష్టంగా ఉంది. ఆమె నా భార్య కాబట్టి నేను ఈ విషయం చెప్పడం లేదు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆలియా బహుశా చాలా ముఖ్యమైన నటీనటుల్లో ఒకరు. తెరపై ఆమె చేసిన పని లేదా ఆమె తనను తాను మోసుకెళ్లే విధానం, ఆమె కలిగి ఉన్న విలువకు కట్టుబడి ఉందన్నారు రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor).
నేను పురుషులు లేదా స్త్రీలలో ఆ శక్తిని తాను చూడలేదన్నారు. మనం దానిని గౌరవించాలని నేను కోరుకుంటున్నానని తెలిపాడు నటుడు. రణ్ బీర్ , ఆలియా కలిసి నటించాచరు బ్రహ్మాస్త్ర.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
ఊహించని రీతిలో సినిమా సక్సెస్ టాక్ అందుకుంది. సినిమా ప్రమోషన్ ను కూడా ఆమె గర్భవతిగా ఉంటూనే పాల్గొన్నారు. దీనిపై విమర్శలు రావడాన్ని తీవ్రంగా అభ్యంతరం తెలిపారు రణబీర్ కపూర్.
ఆయన చేసిన కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : కొరియన్ సింగర్ జిమిన్ సెన్సేషన్
#NDTVExclusive | Ranbir Kapoor To NDTV On Alia Bhatt's (@aliaa08) Pregnancy: "Any Criticism Is Just Jealousy" https://t.co/NIs6kZtP28 pic.twitter.com/G9WlRsMt8q
— NDTV (@ndtv) September 18, 2022